ఎల్లో చుడీదార్ లో రకుల్ ప్రీత్ మెరుపులు.. ట్రెడిషనల్ వేర్ లోనూ ఢిల్లీ బ్యూటీ మత్తు ఫోజులు..

First Published | Sep 20, 2023, 8:34 PM IST

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బ్యూటీఫుల్ లుక్స్ లో ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ వేర్స్ లో మెరుస్తూ నెట్టింట సందడి చేస్తోంది. తాజాగా ఫెస్టివల్ లుక్ లో దర్శమనిచ్చి మంత్రముగ్ధులను చేసింది. 
 

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)  కొన్నాళ్లు టాలీవుడ్ లో వెలుగొందిన విషయం తెలిసిందే. మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి టాప్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది.
 

2019 వరకు ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు వరుస చిత్రాలతో అలరించింది. చివరిగా ‘కొండపొలం’లో మెరిసింది. ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకులేకపోయింది. అంతకుముందు వచ్చిన చిత్రాలు కూడా ఆశించిన మేర ఫలితానివ్వలేదు. దీంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
 


గతేడాది బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ నార్త్ లో సందడి చేసింది. ఏకంగా నాలుగైదు చిత్రాల్లో నటించి సెన్సేషన్ గా మారింది. కానీ ఆ చిత్రాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోపోగా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. 

దీంతో మళ్లీ రకుల్ చూపు సౌత్ సినిమాలపైనే పడింది. తెలుగులో ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్స్ లేకపోయినా.. కోలీవుడ్ లో మాత్రం రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది. శంకర్ - కమల్ హాసన్ కాంబోలోని ‘ఇండియన్ 2’తో పాటు శివ కార్తీకేయన్ ‘ఆయలాన్’ సై-ఫైలోనూ నటిస్తోంది.

ప్రస్తుతం వెండితెరపై పెద్దగా సందడి చేయలేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తనగురించిన అప్డేట్స్ అందిస్తూ ఆకట్టుకుంటోంది. అలాగే గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ కట్టిపడేస్తోంది. 

తాజాగా రకుల్ ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. ఎల్లో చుడీదార్ లో మంత్రముగ్ధులను చేసింది. బ్యూటీఫుల్ అవుట్ ఫిట్ లో మైమరిపించేలా ఫొటోషూట్ చేసింది. మత్తు చూపులు, మత్తెక్కించే ఫోజులతో కట్టిపడేసింది. ఆకట్టుకునే ఫోజులతో అదరగొట్టింది. ఫ్యాన్స్, నెటిజన్లను ఫిదా చేసింది. 

Latest Videos

click me!