ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ... అమెరికాలో ఫ్యామిలీతో సెటిల్ అయ్యింది. తెలుగు సంస్కృతిని అక్కడి ప్రజలకు నేర్పిస్తోంది. అభినయ కూచిపూడి అకాడెమీ స్థాపించి ఇండియన్ క్లాసికల్ డాన్స్ ల్లో విదేశీయులకు శిక్షణ ఇస్తోంది.
కూచిపూడి, భారతనాట్య క్లాస్ లను నేర్పిస్తున్నారు. అమెరికాలోనే కాకుండా స్కాట్ లాండ్, ఇతర దేశాల్లోనూ మన సంస్కృతిని మరింతగా పరిచయం చేయడంలో కృషి చేస్తోంది. ఆమె కూతురు తాన్య హారతి (Tanya Harathi) కూడా అదే ఫీల్డ్ లో ఉన్నారు.
ఇక తెలుగు ప్రేక్షకులకు చాలా దూరమైన ప్రశాంతి హారతి తాజాగా ఓ ఇంటర్వ్యూతో తన గురించిన విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వడం గురించి మాట్లాడుతూ... సునీల్ (Sunil) గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.
ఆమె మాట్లాడుతూ.. గతంలో ‘పెళ్లాం ఊరెళితే’ సినిమాలో నటించాను. సునీల్ కు వైఫ్ పాత్రలో నటించడం నాకు మంచి గుర్తింపును తెచ్చింది. ఆడియెన్స్ దృష్టిలో నేనింకా సునీల్ పెళ్లాన్నే.. అలాంటి డీసెంట్ పాత్రల్లో నటించేందుకు ముందుంటాను.
టాలీవుడ్ లోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలంటే.. మంచి పాత్రలు ఉంటే మాత్రం తప్పకుండా నటిస్తాననని చెప్పుకొచ్చింది ప్రశాంతి హారతి. ప్రస్తుతానికి ఆన్ లైన్ లో నాట్య పాఠాలు చెబుతూ బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చారు.