బుట్టబొమ్మ ర్యాంప్ వాక్.. అదిరిపోయే డ్రెస్ లో ఆకట్టుకున్నప్రణీతా సుభాష్.. పిక్స్

First Published | Aug 14, 2023, 4:42 PM IST

కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సినిమా ఫంక్షన్లలోనూ మెరుస్తూ సందడి చేస్తోంది. తాజాగా సైమా ప్రీఈవెంట్ వేడుకలో మెరిసింది.
 

బ్యూటీఫుల్ అండ్ గ్లామరస్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash) ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఫ్యాన్స్ కు చాలా టచ్ లో ఉంటున్నారు. మరోవైపు సినిమా ఫంక్షన్లలోనూ మెరుస్తోంది. 
 

అయితే తాజాగా బెంగళూరులో నిర్వహించిన సైమా ప్రీఈవెంట్ వేడుకలో బుట్టబొమ్మ పాల్గొంది. ఈవెంట్ లో భాగంగా నిర్వహించిన ర్యాంప్ వాక్ లోనూ ప్రణీతా పార్టిసీపేట్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో బ్యూటీఫుల్ లుక్ లో ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకుంది. 
 


అందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా అభిమానులనుతో పంచుకుంది. బ్లాక్ డిజైన్డ్ లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్, వెనకాల ఈకలలాంటి డిజైన్ ను కలిగి డ్రెస్  ధరించింది. అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ర్యాంప్ వాక్ చేస్తూ ఫొటోలకు తనదైన శైలిలో ఫోజులిచ్చింది.
 

మొదటి లాక్ డౌన్ లోనే ప్రణీతకు పెళ్లైన విషయం తెలిసిందే. ఇక గతేడాది ఈ ముద్దుగుమ్మ ఓ పాపకు కూడా జన్మనిచ్చింది. అయినా చెక్కుచెదరని అందంతో ఆకట్టుకుంటోంది. గ్లామర్ విషయంలో మరింతగా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది. రోజురోజుకు యంగ్ గా కనిపిస్తోంది. 
 

తాజాగా ఫొటోలను పంచుకుంటూ ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ ఇచ్చింది... ‘ర్యాంప్‌పై నడిచే సౌరభాన్ని మించినది ఏదీ లేదు! బెంగళూరులో సైమా ప్రీఈవెంట్ సందర్భంగా‘ అని పేర్కొంది. మొత్తానికి తన నయా లుక్ తో ప్రణీతా అభిమానులను ఖుషీ చేసింది. 

సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. అయితే ఈసారి మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోంది. మలయాళ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ 148వ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక తెలుగులోకి ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 
 

Latest Videos

click me!