జాన్వీ కపూర్ షాకింగ్ రెమ్యునరేషన్? NTR30కి మరింత పెంచేసిందిగా? ఎన్ని కోట్లంటే..

First Published | Mar 9, 2023, 4:54 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ త్వరలో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. రీసెంట్ గానే NTR30 హీరోయిన్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అందింది.
 

అలనాటి నటి, అతిలోక సుందరి శ్రీదేవి కూతురి యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటూ నార్త్  ఆడియెన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. త్వరలో తెలుగు ఆడియెన్స్ ను అలరించేందుకు జాన్వీ టాలీవుడ్ లో అడుగుపెట్టబోతోంది. 
 

తాజాగా ఉత్కంఠకు తెర పడ్డ విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ బర్త్ డే సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) సరసన  NTR30 హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతుందని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో జాన్వీ ఎంట్రీ తెలుగులోకి చాలా గ్రాండ్ గా ఉండబోతుందని అర్థమవుతోంది. 
 


అయితే ఈ భారీ ప్రాజెక్ట్ కోసం జాన్వీ కపూర్ భారీగానే ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.  ఇప్పటికే బాలీవుడ్ లో మంచి జోష్ లో ఉన్న జాన్వీ కపూర్ ఒక్కో సినిమాకు ఏకంగా రూ.3 నుంచి రూ.3.50 కోట్లు  తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.  ఇక టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుండటంతో మరింతగా ఛార్జ్ చేసిందని అంటున్నారు. 
 

లేటెస్ట్ టాక్ ప్రకారం.. జాన్వీ కపూర్ కు NTR30లో నటించేందుకు ఏకంగా రూ.5 కోట్ల వరకు అందజేస్తున్నారని అంటున్నారు. సీనియర్ హీరోయిన్లు తీసుకునే రెమ్యునరేషన్ అందుకుంటుండటంతో అంతా షాక్ అవుతున్నారు. జాన్వీ క్రేజ్ కూడా గట్టిగా నే ఉండటంతో అంతలా ఛార్జ్  చేస్తున్నారని అంటున్నారు. 
 

ఇక రీసెంట్ గా NTR30 నుంచి వచ్చిన జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. జాన్వీ  తొలి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం  ఈ బ్యూటీ ‘మిస్టర్ అండ్ మిస్ మహి’ షూటింగ్ లో ఉంది. తను నటించిన మరో చిత్రం ‘బావల్’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.  

ఇక NTR30 షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆస్కార్స్ అవార్డ్స్ వేడుకలో హాజరయ్యేందుకు అమెరికాకు వెళ్లారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వసస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.  వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.  

Latest Videos

click me!