లండన్ లో షాపింగ్ చేస్తూ పాయల్ రాజ్ పుత్ రచ్చ.. ఆ అప్డేట్ ఈరోజే..

First Published | Aug 16, 2023, 1:38 PM IST

‘ఆర్ ఎక్స్ 100’ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం లండన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా అక్కడి నుంచి కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ట్రెండీ వేర్ లో ఆకట్టుకుంటోంది.  
 

తెలుగులోకి RX100 తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే ఈ ముద్దుగుమ్మ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా బోల్డ్ పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. నటన పరంగా, అందం పరంగానూ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. 

అజయ్ భూపతి - పాయల్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మంగళవారం’. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంలో పాయల్  ప్రధాన పాత్రగానే కథసాగుతుంది. దీంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. 
 


ఇక ఈరోజు సినిమా నుంచి ‘గణగణ మోగాలిరా’ ఫస్ట్ సింగిల్ రానుంది. ఈ సందర్భంగా పాయల్ తన లండన్ ట్రిప్ నుంచి కొన్ని ఫొటోలను పంచుకుంది. లండన్ లో షాపింగ్ చేస్తున్న సందర్భంగా, ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్న క్రమంలో ఫొటోలకు ఫోజులిచ్చింది. స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంది. 

కొద్దిరోజులుగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పెద్దగా సందడి చేయడం లేదు. కీలకమైన అప్డేట్స్  ఉంటేనే తళుక్కున మెరుస్తోంది. ఇక ‘మంగళవారం’ సినిమాతోనైనా పాయల్ కు పూర్వవైభవం వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. 

Latest Videos

click me!