గతంలో ‘ఇస్మార్ట్ శంకర్’తో ఆకట్టుకున్న నిధి అగర్వాల్.. ఆ చిత్రం బ్లాక్ బాస్టర్ కావడంతో తర్వాతి నుంచి భారీ ఆఫర్లను అందుకుంటోంది. గ్లామర్ పరంగా, నటన పరంగా ఇప్పటికే ఒకే అనిపించుకున్న ఈ బ్యూటీ.. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగు బ్యూటీ ఫుల్ బిజీ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.