ట్రెడిషనల్ వేర్ లో పద్ధతిగా మెరిసిన ‘రాధిక’.. సంప్రదాయ దుస్తుల్లోనూ కట్టిపడేస్తోందిగా..

First Published | Oct 29, 2023, 8:32 PM IST

యంగ్ బ్యూటీ నేహా శెట్టి బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. సంప్రదాయ దుస్తుల్లో పద్ధతిగా దర్శనమిచ్చి అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 
 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty)  వరుసగా రెండు చిత్రాలతో అలరించింది. ‘బెదరులంక2012’, ‘రూల్స్ రంజన్’ సినిమాలతో వెండితెరపై మెరిసింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అదరగొట్టింది.
 

కానీ పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆశలన్నీ నెక్ట్స్  ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంపైనే పెట్టుకుంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు నెలకొన్నాయి. 
 


ప్రస్తుతం ఈ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతున్నాయి. డిసెంబర్ 8న చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది విశ్వక్ మరోసారి నొక్కి చెప్పారు. ఈ క్రమంలో నేహా శెట్టి మాత్రం తన సినిమాలనూ ప్రమోట్ చేసుకుంటూనే వస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తోంది.
 

నెట్టింట నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ తన అభిమానులను ఫిదా చేస్తోంది. నిన్నటి వరకు చీరకట్టులో దర్శనమిచ్చి మతులు పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ట్రెడిషనల్ వేర్ లో నే కనువిందు చేసింది. సంప్రదాయ దుస్తుల్లో పద్ధతిగా మెరిసి మంత్రముగ్ధులను చేసింది. 

లేటెస్ట్ పిక్స్ లో నేహా శెట్టి లేత గులాబీ రంగు చుడీదార్ లో మెరిసింది. ట్రెడిషనల్ వేర్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. క్యూట్ గా ఫొటోలకు ఫోజులిచ్చి కట్టిపడేసింది. నిషా కళ్లతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్  నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 

నేహా శెట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రస్తుతం సందడి చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇక్కడే అవకాశాలు అందుకుంటూ వస్తోంది. ఇక ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ తర్వాత ఎలాంటి సినిమాలో మెరుస్తుందో చూడాలి.

Latest Videos

click me!