బ్యూటీఫుల్ అవుట్ ఫిట్ లో మిర్నా మీనన్ మెరుపులు.. తెలుగులో సందడి చేసేలా ఉందే!

First Published | Oct 2, 2023, 1:18 PM IST

మిర్నా మీనన్ ‘జైలర్’తో మంచి గురింపు తెచ్చుకుంది. రజినీకాంత్ కోడలి పాత్రలో మెప్పించింది. వెండితెరపై పద్ధతిగా మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ వరుసగా ఫొటోషూట్లతో రచ్చ చేస్తోంది.
 

‘జైలర్’ నటి మిర్నా మీనన్ (Mirna Menon) తమిళ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ హీరోయిన్ గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా రెండు చిత్రాల్లో మెరిసింది. అటు కోలీవుడ్ లోనూ సందడి చేస్తోంది. 
 

ఆది సాయికుమార్ సరసన ‘క్రేజీ ఫెలో’లో, అల్లరి నరేష్ సరసన ‘ఉగ్రం’ సినిమాలో నటించింది. కానీ ఈ చిత్రాలతో ఆమెకు పెద్దగా క్రేజ్ దక్కలేదనే చెప్పాలి. వాటి ఫలితం కూడా అంతంతమాత్రనే ఉండటంతో వెలగలేకపోయింది. 
 


ఇక రీసెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన కోలీవుడ్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్  ‘జైలర్’తో మంచి క్రేజ్ దక్కించుకుంది. రజినీకాంత్ కోడలి పాత్రలో పద్ధతిగా మెరిసి ఆకట్టుకుంది. ఆమె నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. మరోవైపు తెలుగు దర్శక నిర్మాతల చూపు కూడా తనపై పడేలా చేసింది.
 

ఈ క్రమంలో తెలుగులో మంచి ఆఫర్లు అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే కింగ్ నాగార్జున ‘నా సామిరంగ’ చిత్రంలో అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు త్వరలోనే అఫీషియల్ అప్డేట్  కూడా రానుందని అంటున్నారు. ఇకపై తెలుగులో రచ్చ చేయనుందని కూడా అభిప్రాయపడుతున్నారు. 
 

మిర్నా మీనన్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ కనిపిస్తున్నారు. తన గురించిన అప్డేట్స్ ఇవ్వడంతో పాటు బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ కట్టిపడేస్తోంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. అదిరిపోయే ఫోజులతో మైమరిపించింది. 
 

గ్రీన్ లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్ లో అందాల మెరుపులు వెదజల్లింది. నడుము సొగసుతో మైమరిపించింది. కిర్రాక్ ఫోజులతో పాటు బ్యూటీఫుల్ స్మైల్ తో కట్టిపడేసింది. నిషా కళ్లతో మత్తెక్కించే చూపులతో మంత్రముగ్ధులను చేసింది. ఈ బ్యూటీ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం ‘బర్త్ మార్క్’ అనే చిత్రంలో నటిస్తోంది.  

Latest Videos

click me!