మెరిసిపోయే స్కిన్ టోన్ తో మెస్మరైజ్ చేస్తున్న మెహ్రీన్.. సైడ్ యాంగిల్ లో యంగ్ బ్యూటీ క్యూట్ స్టిల్

First Published | Aug 16, 2023, 4:33 PM IST

యంగ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా వెకేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత ఓ బ్యూటీఫుల్ ఫొటోను అభిమానులతో షేర్ చేసుకుంది.  మెరిసిపోయే అందంతో కట్టిపడేసింది. 
 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా (Mehreen Pirzada) తన కెరీర్ ప్రారంభం నుంచి తెలుగు సినిమాలపైనే ఆశలు పెట్టుకుంది. తొలుత నేచురల్ స్టార్ నాని సరసన ‘కృష్ణగాడి వీర ప్రేమ కథ’తో హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీ మంచి సక్సెస్ ను అందించింది. 
 

ఆ వెంటనే వచ్చిన ‘మహానుభావుడు’లోనూ మంచి పెర్ఫామెన్స్ తో మెహ్రీన్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తన నటన, గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. ఫలితంగా టాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన మేర ఫలితానివ్వలేదు. 
 


దీంతో మెహ్రీన్ కంటే వెనుకొచ్చిన ముద్దుగుమ్మలు రాకెట్ స్పీడ్ తో కెరీర్ లో దూసుకెళ్తున్నారు. హిట్లను జమచేసుకుంటున్నారు. కానీ అనిల్ రావిపూడి రూపంలో మెహ్రీన్ హిట్ల పంట పండింది. ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ చిత్రాలతో మళ్లీ హిట్ అందుకుంది. ప్రస్తుతం మళ్లీ జోరు తగ్గింది.
 

కానీ సోషల్ మీడియాలో మాత్రం మెహ్రీన్ తళుక్కున మెరుస్తూనే ఉంది. తన వెకేషన్లకు సంబంధించిన ఫొటోలు, తన గురించి అప్డేట్స్ అందించే సమయంలో నెట్టింట దర్శనమిస్తోంది. తాజాగా బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. లేటెస్ట్ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.

ఓ హోటల్ ను సందర్శించిన మెహ్రీన్ పిర్జాదా క్యూట్ గా ఫొటోకు ఫోజిచ్చింది. బ్లాక్ ట్రెండీ వేర్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. గాగూల్స్ ధరించి, స్లీవ్ లెస్ గౌన్ లాంటి డ్రెస్ లో షోల్డర్ అందాలను మెరిపించింది. వెలిగిపోయే చర్మ సౌందర్యంతో మెస్మరైజ్ చేసింది.
 

ఇలా సమయం ఉన్నప్పుడల్లా మెహ్రీన్ తన బ్యూటీఫుల్ ఫొటోలను నెట్టింట వదులుతూ ఫ్యాన్స్ ను, నెటిజన్లను ఫిదా చేస్తోంది. అలాగే దర్శక నిర్మాతల కంట్లోనూ పడేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. మెహ్రీన్ ప్రస్తుతం తెలుగు, తమిళం బైలింగ్వుల్ ఫిల్మ్ ‘ స్పార్క్’,  కన్నడలో Nee Sigoovaregu  అనే చిత్రాల్లో నటిస్తోంది. ఇవి షూటింగ్ దశలో ఉన్నాయి. 
 

Latest Videos

click me!