పర్పుల్ చుడీదార్ లో మలయాళీ భామ బ్యూటీపుల్ లుక్.. ఆకట్టుకునే పోజులతో మాళవిక మోహనన్ రచ్చ..

First Published | May 4, 2023, 4:06 PM IST

యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేస్తోంది. బ్యూటీపుల్ డ్రెస్ లో కుర్రగుండెల్ని దోచుకుంటోంది.  తాజా ఫొటోషూట్ తో మలయాళీ ముద్దుగుమ్మ చూపు తిప్పుకోకుండా చేసింది. 
 

కోలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది యంగ్ హీరోయిన్ మాళవికా మోహనన్ (Malavika Mohanan).  తమిళ చిత్రాలతో ఈ మలయాళీ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలను అందుకుంటోంది.
 

తమిళ స్టార్ విజయ్ దళపతి సరసన ‘మాస్టర్’ చిత్రంలో మాళవిక మోహనన్ నటించిన విషయం తెలిసిందే.  ఈ మూవీ తెలుగులోనూ డబ్డ్ వెర్షన్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతోమాళవికకు ఇక్కడా కాస్తా క్రేజ్ పెరిగింది. మాళవిక కూడా  తన క్రేజ్ ను మరింత పెంచుకునేందుకు సోషల్ మీడియాలో బిజీగా కనిపిస్తోంది.
 


ఈ సందర్భంగా యంగ్ బ్యూటీ అభిమానులకు తన గురించి ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్ కూడా ఇస్తూ వస్తోంది. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో బ్యూటీఫుల్ గా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది.  తాజాగా మాళవిక పంచుకున్న ఫొటోలు ఫ్యాన్స్ త‌ో పాటు నెటిజన్ల కూడా చూపు తిప్పుకోకుండా చేశాయి. 

లేటెస్ట్ ఫొటోస్ లో మాళవికా పర్పుల్ కలర్ చుడీదార్ లో మెరిసింది. స్లీవ్ లెస్ టాప్ లో షోల్డర్ అందాలతో మైమరింపించింది. మరోవైపు ఫ్లవర్ షాపులో బొకె పట్టుకుని అందంగా ఫొటోలకు ఫోజులిచ్చింది. మరోవైపు సిట్టింగ్ పోజులతోనూ కట్టిపడేసింది. బ్యూటీపుల్ స్మైల్ తో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది.

మొన్నటి వరకు ముంబైలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ  చెన్నై తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇంటి భోజనం చేస్తూ కనిపించింది. అందుకు సంబంధించిన ఫొటోను కూడా పంచుకుంది. దీంతో మాళవికా మోహనన్ ఇంట్లో చేసిన వంటలకే ప్రియార్టీ ఇస్తుందని పరోక్షంగా తెలియజేసింది. ప్రస్తుతం తను పంచుకున్న ఫొటోలు వైరల్ గా మారాయి.
 

ప్రస్తుతం మాళవికా మోహనన్ కేవలం తమిళ చిత్రాల్లోనే కాకుండా హిందీ,  తెలుగు చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది. త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రభాస్ సరసన మారుతీ డైరెక్షన్ లో నటిస్తున్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ స్టార్ చియాన్ విక్రమ్ కు జోడీగా ‘తంగలన్’లో నటిస్తోంది. 
 

Latest Videos

click me!