ఆరెంజ్ గౌన్ లో మాళవికా మోహనన్ మెరుపులు.. బ్యూటీఫుల్ స్టిల్స్ తో కట్టిపడేస్తున్న తమిళ బ్యూటీ..

First Published | Sep 14, 2023, 6:47 PM IST

తమిళ హీరోయిన్ మాళవికా మోహనన్ బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ లుక్ లో ఆకట్టుకుంటోంది. అదిరిపోయే స్టిల్స్ తో కట్టిపడేసింది.
 

యంగ్ బ్యూటీ మాళవికా మోహనన్ (Malavika Mohanan)  కోలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. తన నటనతోనూ మెప్పించింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. 

కేరళలకు చెందిన ఈ ముద్దుగుమ్మ ముంబైలోనే  పెరిగింది. నటనపైన ఆసక్తి ఉండటంతో తొలుత కమర్షియల్ యాడ్స్ లో మెరిసింది. ఆ తర్వాత మలయాళ చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. తొలిచిత్రమే స్టార్ హీరో కొడుకు దుల్కర్ సల్మాన్ తో కలిసి చేసింది.
 


మలయాళం చిత్రాలతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత కన్నడ, హిందీ, తమిళం చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ  అడుగుపెట్టాల్సింది టాలీవుడ్ లోనే. ఇప్పటికే తెలుగు ఆడియెన్స్ కూ డబ్డ్ సినిమాలతో పరిచయం అయ్యింది. 

తమిళ స్టార్ విజయ్ దళపతి ‘మాస్టర్’, ధనుష్ ‘మారన్’ చిత్రాలు తమిళంతో పాటు తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడి ఆడియెన్స్ నూ ఆకట్టుకుంది. త్వరలో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. 

ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మారుతీ కాంబోలో రాబోతున్న చిత్రంలో మాళవికా హీరోయిన్ గా ఛాన్స్ అందుకుందని అంటున్నారు. ఇంత వరకు సినిమాపైనే ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే మాళవికా ఎంట్రీ అదిరిపోవడం ఖాయం.
 

ఇదిలా ఉంటే.. మాళవికా సోషల్ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. బ్యూటీఫుల్ అవుట్ ఫిట్లలో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. ఖతర్నాక్ ఫొటోషూట్లతో కేరళ కుట్టి కట్టిపడేస్తోంది. తాజాగా ఆరెంజ్ గౌన్ లో మెరిసింది. నిషా కళ్లతో, మైమరిపించే ఫోజులతో మంత్రముగ్ధులను చేసింది. పిక్స్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లనూ ఆకట్టుకుంటోంది.

Latest Videos

click me!