వీళ్లిద్దరి బ్రేకప్ సౌత్ లో హాట్ టాపిక్ గా మారింది. అటు రజని అభిమానులు, ధనుష్ అభిమానులు ఈ వార్తని జీర్ణించుకోలేకున్నారు. 2004లో ధనుష్, ఐశ్వర్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 18 ఏళ్ల పాటు కలసి జీవించిన ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకుని విడిపోయారు. దీనితో సోషల్ మీడియాలో వీరిద్దరి గురించే చర్చ జరుగుతోంది. చాలా మంది అభిమానులు ధనుష్, ఐశ్వర్య వెంటనే విడాకులు రద్దు చేసుకుని కలిసిపోవాలని కోరుతున్నారు.