చీరకట్టులో మెరిసిపోతున్న బేబమ్మ.. కొంగును ఎగరేస్తూ, చిలిపి పోజులతో మతులు పోగొడుతున్న కృతి శెట్టి..

First Published | May 10, 2023, 8:49 PM IST

‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) చీరకట్టులో మెరిసిపోతోంది. సంప్రదాయ దుస్తుల్లోనూ అందంతో కుర్రకారును కట్టిపడేస్తోంది. లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ఇండస్ట్రీలోకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చింది. తొలిచిత్రంతోనే హిట్ ఖాతాను ఓపెన్ చేసింది. తన పెర్ఫామెన్స్ తో బేబమ్మగానూ గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తూ వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కుర్రభామ అదరగొడుతోంది. 
 

ప్రస్తుతం ‘కస్టడీ’ చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతోంది.  ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)కు జోడీగా నటించింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. మే 12 గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది.  ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహించారు. 
 


కృతి శెట్టి కూడా ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సోషల్ మీడియాలోనూ అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఈ క్రమంలో చీరకట్టులో మెరిసింది.
 

బేబమ్మ చీరకట్టు అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకోవడంతో చూపుతిప్పుకోలేకపోతున్నారు. మరోవైపు స్లీవ్ లెస్ బ్లౌజ్ లోనూ కృతి శెట్టి గ్లామర్ మెరుపులు మెరిపించడంతో మైమరిచిపోతున్నారు.  బేబమ్మ అందాలకు ఫిదా అవుతున్నారు. 

లేటెస్ట్ ఫొటోషూట్ కోసం చీరకట్టులో కృతి శెట్టి ఇచ్చిన ఫోజులకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కామెంట్లతో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఆకాశానికి ఎత్తుతున్నారు. మరోవైపు చీరకొంగును గాల్లో ఎగరేస్తూ కుర్ర భామ చేసిన చిలిపి చేష్టలకు మంత్రముగ్ధులు అవుతున్నారు. మత్తుచూపులకు, మతులు పోయే ఫోజులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 

బేమ్మకు సోషల్ మీడియాలో అంతకంతూ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 5.5 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉంది. ఇలా నెట్టింట అందంగా మెరుస్తూ ఆ సంఖ్యను మరింతగా పెంచుతోంది. కృతి శెట్టి ‘కస్టడీ’తో పాటు, మలయాళంలో ‘అజాయంతే రందం మోషణం’లో నటిస్తోంది. వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్న వస్తున్న ఈ ముద్దుగుమ్మ Custodyపైనే గంపెడు ఆశలు పెట్టుకుంది. 

Latest Videos

click me!