బ్లూ షర్ట్ లో కాలేజీ స్టూడెంట్ లా కత్రినా కైఫ్.. తన ఫస్ట్ బేబీకి అప్పుడే వెల్కమ్ చెబుతుందంట?

First Published | May 7, 2023, 10:17 AM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా  కైఫ్ (Katrina Kaif) లేటెస్ట్ సెల్ఫీలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ క్రమంలో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చే విషయంపై ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. 
 

బాలీవుడ్ హాట్ భామ, స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచమే. విక్టరీ వెంకటేశ్ సరసన ‘మల్లీశ్వరీ’,  బాలయ్య సరసన ‘అల్లరి పిడుగు’ చిత్రాలతో అలరించింది. తన అందం, నటనతో కట్టిపడేసింది. ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితమైంది. వరుస చిత్రాలతో అలరిస్తోంది.
 

అయితే కత్రినా, 2021 లాక్ డౌన్ లో బాలీవుడ్ స్టార్ విక్కీ కౌషల్ (Vicky Kaushal)ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మ్యారేజ్ తర్వాత కత్రినా - విక్కీ కౌషల్ హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అప్పట్లో తన భర్తతో కలిసి వరుస టూర్లకు వెళ్లింది. ఆ ఫొటోలను అభిమానుతో పంచుకుని నెట్టింట సందడి చేసింది.
 


ప్రస్తుతం కత్రినా నుంచి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కత్రినా తర్వాత పెళ్లి చేసుకున్న హీరోయిన్లు అలియా భట్, నయన్  తార తల్లిదండ్రులుగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కత్రినా  కూడా ఆ శుభవార్త ఎప్పుడూ చెప్పబోతుందని వెయిట్ చేస్తున్నారు. 
 

తాజాగా ఇందుకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. తన ఫస్ట్ బేబీకి ఎప్పుడు వెల్కమ్ చెప్పాలనేది కత్రినా ఫ్లాన్ చేశారంట. ఈవిషయాన్ని తన స్నేహితులతో చెప్పినట్టుగా  బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

కత్రినా చేతిలో ప్రస్తుతం ‘మేరీ క్రిస్టమస్’, ‘టైగర్3’ చిత్రాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ తర్వాత గుడ్ న్యూస్ చెప్పబోతోందంటున్నారు.  ఇదే నిజమైతే కత్రినా త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందబోతుందని తెలుస్తోంది.  దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
 

ఇక కత్రినా తాజాగా "సమ్మర్ బ్లూస్" అంటూ క్రేజీ పోస్ట్ పెట్టారు. బ్లూ లైన్స్ ష్టర్ లో కాలేజీ స్టూడెంట్ లా దర్శనమిచ్చింది. అదిరిపోయే సెల్ఫీలతో, రూపసౌందర్యంతో చూపుతిప్పుకోకుండా చేసింది. ముంబైలోని  తన ఇంటిలోనే క్యూట్ స్మైల్ తో కట్టిపడేసింది. నెట్టింట వరుస పోస్టులు ఇలా పెడుతుండటంతో ఖుషీ అవుతున్నారు. 
 

Latest Videos

click me!