తెల్లచీరలో మంత్రముగ్ధులను చేస్తున్న ఐశ్వర్య మీనన్.. ఆమె అందానికి ఫిదా అయిన టాలీవుడ్ డైనమిక్ హీరో

First Published | Jun 5, 2023, 1:24 PM IST

తమిళ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ త్వరలో తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసుకోబోతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఈ ముద్గుమ్మ అదిరిపోయే ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ పిక్స్ లో బ్యూటీఫుల్ గా ఉంది. 
 

తమిళ చిత్రాలతో యంగ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ (Iswarya Menon)  మంచి గుర్తింపు దక్కించుకుంది. తన రూపసౌందర్యం, నటనతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంది. ఇన్నాళ్లు కోలీవుడ్ లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇక తెలుగు ప్రేక్షకులనూ పలకరించబోతోంది.
 

ఐశ్వర్య మీనన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తుంటుంది. తన సినిమాల గురించి అప్డేట్స్ అందిస్తూనే.. మరోవైపు అదిరిపోయే ఫొటోషూట్లతో మంత్రముగ్ధులను చేస్తుంటుంది. తనదైన శైలిలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంటుంది. 
 


తాజాగా ఐశ్వర్య మీనన్ శారీలో దర్శనమిచ్చింది. తెల్లచీరలో ఈ ముద్దుగుమ్మ మరింత అందాన్ని సొంతం చేసుకుంది. సంప్రదాయ దుస్తులు ఐశ్వర్యకు రెట్టింపు అందాన్ని తెచ్చిపెట్టాయి. ఈ సందర్భంగా చీరకట్టులో హోయలు పోతూ చూపుతిప్పుకోకుండా చేసింది.
 

తెల్లచీర, మ్యాచింగ్ బ్లౌజ్, అట్రాక్టివ్ జ్యుయెల్లరీ ధరించి ఫ్యాన్స్ ను, నెటిజన్లను ఫిదా చేసింది. చిట్టి నడుముపు చూపిస్తూ మతులు పోగొట్టింది. ఓరచూపుతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. అదిరిపోయే ఫోజులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

తన అభిమానులతో ఐశ్వర్య పంచుకున్న పిక్స్ కు టాలీవుడ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddhartha) కూడా ఫిదా అయ్యారు. ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ ఫొటోలను లైక్ చేశారు. ఇక నెటిజన్లు కూడా ఈ బ్యూటీని లైక్స్, కామెంట్లతో ఎంకరేజ్ చేస్తున్నారు. 
 

కాగా, నిఖిల్ - ఐశ్వర్య మీనన్ జంటగా ‘స్పై’ మూవీ రూపుదిద్దుకుంటోంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా నిర్మించారు. జూన్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది తెలుగులో ఐశ్వర్యకు తొలిచిత్రం కావడం విశేషం. ఇప్పటికే చిత్రంపై హైప్ క్రియేట్ అవడంతో ఐశ్వర్యకు టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ లభించే అవకాశం ఉందంటున్నారు. 
 

Latest Videos

click me!