సినిమాల్లో అన్నయ్యగా ఓకె.. కానీ ఆఫ్ స్క్రీన్ లో ప్రభాస్ ని రే* చేస్తా, నటి కామెంట్స్ తో దుమారం

Published : Aug 07, 2023, 11:33 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి మాస్ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉందో.. అమ్మాయిల్లో కూడా అంతే క్రేజ్ ఉంది. ప్రభాస్ అమ్మాయిలకు కలల రాకుమారుడు. ఏ హీరోయిన్ ని అడిగినా ప్రభాస్ తో నటించాలని ఉందని చెబుతారు.

PREV
16
సినిమాల్లో అన్నయ్యగా ఓకె.. కానీ ఆఫ్ స్క్రీన్ లో ప్రభాస్ ని రే* చేస్తా, నటి కామెంట్స్ తో దుమారం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి మాస్ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉందో.. అమ్మాయిల్లో కూడా అంతే క్రేజ్ ఉంది. ప్రభాస్ అమ్మాయిలకు కలల రాకుమారుడు. ఏ హీరోయిన్ ని అడిగినా ప్రభాస్ తో నటించాలని ఉందని చెబుతారు. అయితే ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న యువ నటి మాత్రం ప్రభాస్ పై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. 

26

ఆ నటి పేరు ఇందు. ఇప్పటికి ఆమె సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో మాత్రమే రాణిస్తోంది. అయితే ప్రముఖ దర్శకులతో ఆమెకి పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమె ప్రభాస్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయి. 

36

సరదాగా ఆ వ్యాఖ్యలు చేసిందో లేక పబ్లిసిటీ కోసం అలా ప్రయత్నించిందో తెలియదు కానీ మొత్తంగా వివాదంలో చిక్కుకుంది. ఇంతకీ ఇందు ఏమందంటే.. ప్రభాస్ తో చెల్లిగా నటించాల్సి వస్తే ఆ పాత్రకి ఒకే చెబుతారా అని ప్రశ్నించగా.. సినిమాల్లో అయితే ఓకె.. చెల్లిగా నటిస్తా. కానీ ఆఫ్ స్క్రీన్ లో  మాత్రం ప్రభాస్ ని రేప్ చేయాలని ఉంది. అంత ఇష్టం అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. 

46

దీనితో ఈమెని ట్రోల్ చేస్తూ పాత వివాదాలని తెరపైకి తెస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ ఎవరైనా హీరో చేస్తే ఊరుకుంటారా అంటూ మహిళా సంఘాలని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే గతంలో సల్మాన్ ఖాన్ తన సుల్తాన్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రేప్ గురించి కామెంట్ చేశాడు. సుల్తాన్ షూటింగ్ చేస్తున్నపుడు తన పరిస్థితి రేప్ కి గురైన మహిళా ఉండేది అంటూ కామెంట్స్ చేయడం జాతీయ స్థాయిలో దుమారం రేపింది. 

56

మహిళా కమిషన్ కూడా సల్మాన్ ఖాన్ కి నోటీసులు పంపింది. చివరికి అమీర్ ఖాన్ కూడా సల్మాన్ అలా మాట్లాడడం దురదృష్టకరం అంటూ ఖండించారు. సల్మాన్ తన కామెంట్స్ లో ఏ మహిళని ఉద్దేశించి అలా మాట్లాడలేదు. ఒక ఉదాహరణగా చెప్పారు. కానీ ఇప్పుడు ఇందు చేసిన వ్యాఖ్యలని మహిళా సంఘాలు ఎలా సమర్ధిస్తాయి అంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. 

66

కొందరు మాత్రం ఇందు కామెంట్స్ ని అంతలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు.. ఆమె ప్రభాస్ పై ఇష్టంతో కొంచెం ఘాటుగా స్పందించింది అని సమర్థిస్తున్నారు. ఇంత ఘాటు వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇందుకి మాత్రం పబ్లిసిటీ, ఆఫర్స్ అంతంత మాత్రమే. హరీష్ శంకర్, బుచ్చిబాబు, తేజ లాంటి దర్శకులతో ఇందు ఫోటోలు దిగి.. వారు తన బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్లుగా కామెంట్స్ పెడుతూ ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories