సినిమాలు ఎందుకు చేయడం లేదో చెప్పిన హేమ.. ఆసక్తికరంగా స్పందించిన నటి!

First Published | Feb 12, 2023, 11:10 AM IST

ప్రముఖ నటి హేమ ఇటీవల కాలంలో పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. దీనిపై ఆమె తాజాగా స్పందించారు. ఎందుకు సినిమాలు చేయడం లేదనే దానిపై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 
 

సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ (Hema) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 1989 నుంచి సినిమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. వందల సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. 

క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలను పండించారు. మరోవైపు కామెడీతోనూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు హేమా. దాదాపు అన్ని పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆయా చిత్రాల్లో మెరిసారు. 


అయితే, హేమ ఇటీవల ఎలాంటి చిత్రాల్లో కనిపించడం లేదు. గతేడాది, ఈ ఏడాది ప్రారంభంలో చాలా సినిమాలు విడుదలైనా ఒక్క చిత్రంలోనూ కనిపించకపోవడం గమనార్హం. అయితే దీనిపై ఆమె తాజాగా స్పందించారు. 

కిర్రాక్ ఆర్పీ ‘పెద్దారెడ్డి నెల్లూరు చేపల పులుసు’ రెండో బ్రాంచ్  ను మణికొండలో ప్రారంభించారు. ఈ సందర్భంగా హాజరైన హేమా ఓ యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడారు. ఈక్రమంలో తను సినిమాలకు ఎందుకు దూరమయ్యారనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. 
 

హేమ మాట్లాడుతూ.. ‘ఈ మధ్యనే కొత్త బిజెనెస్ స్టార్ట్ చేశాం. సాంపదన ఎక్కువైంది. దాంతో సుఖ పడటం అలవాటై కష్టపడటానికి  ఇష్టపడటం లేదు’ అంటూ ఆసక్తికరంగా స్పందించారు. ‘ఇంతకీ ఏం బిజెనెస్?’ అని అడగ్గా.. తన పర్సనల్ ఇంటర్వ్యూలో అన్ని వివరంగా చెప్తానని బదులిచ్చారు. 
 

ఇక హేమ 2021లో విడుదైన ‘కొండపొలం’లో నటించారు. అదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంలోనూ మెరిశారు. ఆ తర్వాత నుంచి ఒక్క సినిమాలో కనిపించలేదు. ఇక మున్ముందు సినిమాల విషయంలో ఎలా ఉంటారో చూడాలి.

Latest Videos

click me!