యాపిల్ బ్యూటీ స్టన్నింగ్ లుక్.. ట్రెండీ వేర్ లో హన్సిక కిర్రాక్ స్టిల్స్.. ఇప్పుడెక్కడుందంటే?

First Published | Aug 8, 2023, 10:09 AM IST

స్టార్ హీరోయిన్ హన్సిక పెళ్లి తర్వాత చాలా దేశాలకు వెళ్తోంది. బ్యాక్ టు బ్యాక్ వెకేషన్లను ప్లాన్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా టర్కీలో మెరిసింది. 
 

టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు వెలుగొందింది హీరోయిన్ హన్సిక మోత్వానీ (Hansika Motwani).  చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ నటిగానూ చిన్నవయస్సులోనే తెరంగేట్రం చేసింది. 
 

‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్ గా  మారిన హన్సిక... తొలిచిత్రంతోనే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అందం, నటనతో ప్రేక్షకుల్లోనూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత వరుస చిత్రాలతో అలరించింది. 
 


గతేడాది డిసెంబర్ 4న హన్సిక పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. తన స్నేహితుడు, వ్యాపారవేత్త సోహెల్ కతూరియాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం జైపూర్ లోని మండొట ఫోర్ట్ అండ్ ప్యాలెస్ లో చాలా గ్రాండ్ గా జరిగింది.
 

పెళ్లి తర్వాత హన్సికా భర్తతో కలిసి మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ వెకేషన్లకు వెళ్తూ సందడి చేస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వరసగా పోస్టులు పెడుతూ తన గురించి అప్డేట్స్ అందిస్తోంది. 
 

ప్రస్తుతం హన్సిక టర్కీలో ఉంది. ఇస్తాంబుల్ నగర అందాలను ఆస్వాదిస్తోంది. ఈ సందర్భంగా ఓ బ్యూటీఫుల్ లోకేషన్ లో యాపిల్ బ్యూటీ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ పిక్స్ ను తాజాగా అభిమానులతో పంచుకుంది. 

లేటెస్ట్ పిక్స్ లో హన్సిక ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. జీన్స్ లెహంగా, క్రాప్డ్ షర్ట్ లో నయా లుక్ లో మెరిసింది. మరోవైపు స్టన్నింగ్ స్టిల్స్ తో, కొంటె ఫొజులతో అట్రాక్ట్ చేసింది. హన్సిక లేటెస్ట్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లు పెడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా హన్సిక కెరీర్ ను కొనసాగిస్తోంది. సెకండ్ ఇన్సింగ్స్ లో మరింత  జోరు చూపించనుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళంలో కలిపి ఏడు చిత్రాల్లో నటిస్తోంది. ఇందులో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 
 

Latest Videos

click me!