జెనీలియా స్మైల్ కు గుండెలు గల్లంతే.. ట్రెడిషనల్ వేర్ లో ‘బొమ్మరిల్లు’ బ్యూటీ బ్యూటీఫుల్ లుక్

First Published | Jun 27, 2023, 6:37 PM IST

‘బొమ్మరిల్లు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న జెనీలియా.. పదేళ్లుగా టాలీవుడ్ కు దూరంగా ఉంది. ప్రస్తుతం మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మెరుస్తోంది.
 

టాలీవుడ్ లో జెనీలియా కొన్నేళ్ల పాటు ఊపూపింది. వరుస చిత్రాలతో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.  మళ్లీ సౌత్ ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్న తరుణంలో సోషల్ మీడియాలో నిత్యం సందడి చేస్తోంది. అటు బాలీవుడ్ లో మాత్రం కెరీర్ ను కంటిన్యూ చేస్తూనే ఉంది.
 

జెనీలియా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరమే లేదు. ‘బాయ్స్’, ‘సత్యం’ చిత్రంతో ఆడియెన్స్ ను పలకరించింది..  ‘సాంబ, సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, రెడీ, ఆరెంజ్, నా ఇష్టం’ వంటి సినిమాలతో అలరించింది. తన అద్భుతమైన పెర్ఫామెన్స్ తో కట్టిపడేసింది. 
 


2012లో వచ్చిన ‘నా ఇష్టం’ తర్వాత తెలుగు చిత్రాలకు గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లాడి లైఫ్ లో సెటిల్ అయ్యింది. పెళ్లి తర్వాత కూడా హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. రీసెంట్ గా ‘వేద్’, ’మిస్టర్ మమ్మీ’ చిత్రాలతో అలరించింది. 
 

తెలుగు ప్రేక్షకులకు పదేళ్లుగా దూరమైన ఈ ముద్దుగుమ్మ త్వరలో మళ్లీ రీఎంట్రీతో అలరించబోతోంది. సినిమాల పరంగా దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ తన గురించి అప్డేట్స్ ఇస్తూనే వస్తోంది. భర్త, పిల్లలతో సందడి చేస్తోంది. మరోవైపు బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది.
 

తాజాగా జెనీలియా బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. గోల్డ్ కలర్ చుడీదార్ లో మెరిసిపోయింది. జడలో ఓల్డ్ హీరోయిన్లలా పువ్వు పెట్టుకొని ఆకట్టుకుంది. ఒకప్పటి జెనీలియా లుక్ లో మెరిసింది.  బ్యూటీఫుల్ స్మైల్, ఆకట్టుకునే ఫోజులతో చూపుతిప్పుకోకుండా చేసింది. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

అభిమానులు కూడా సోషల్ మీడియాలో జెనీలియా పెట్టే పోస్టులను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తూనే ఉంటారు. ఇక జెనీలియా ‘జూనియర్’ చిత్రంలో రీఎంట్రీ ఇవ్వబోతంది. గాలిజనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా నటిస్తున్నారు. త్వరలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Latest Videos

click me!