తెలుగు హీరోయిన్ గా చాందిని చౌదరి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంటోంది. సినిమా ఫలితాలు ఎలాగున్నా ఈ ముద్దుగుమ్మ మాత్రం తన పెర్ఫామెన్స్ తో మాత్రం ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
అయితే, ‘కలర్ ఫొటో’ చిత్రంతో మాత్రం తెలుగు హీరోయిన్ చాందిని చౌదరికి మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డును దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాతనే టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు అందుకుంటోంది.
అంతకుముందు ఆయా చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ వెండితెరపై మెరిసింది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 2015 నుంచి ఇప్పటి వరకు హీరోయిన్ గా, ఆయా పాత్రల్లో అవకాశాలను దక్కించుకుంటూ వస్తోంది.
గతేడాది కిరణ్ అబ్బవరం సరసన ‘సమ్మతమే’ చిత్రంలో నటించింది. బ్యూటీఫుల్ రోల్ లో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. అయితే, ‘కలర్ ఫొటో’ తర్వాత ఈ ముద్దుగుమ్మకు అలాంటి సినిమాలు రాలేదు. కానీ అవకాశాలు మాత్రం అందుకుంటోంది.
ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లో అవకాశాలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది చాదిని చౌదరి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ లుక్ లో దర్శనమిస్తూ వస్తోంది. తన బ్యూటీఫుల్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. ట్రెండీ వేర్స్ లో మెరుస్తూ మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
రెడ్ టాప్, వైట్ ట్రౌజర్, హెయిర్ బ్యాండ్ ధరించి నయా లుక్ లో ఆకట్టుకుంది. ట్రెండీ వేర్స్ లో అదిరిపోయే లుక్ తో ఆకర్షించింది. మరోవైపు క్యూట్ ఫోజులతో చాందిని చౌదరి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఫిదా చేసింది.
తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలను ఇంటర్నెట్ ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఆమె నయా లుక్ ను పొగుడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. చాందిని ప్రస్తుతం ‘గామీ’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అలాగే ‘ఝాన్సీ’ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది.