టాలీవుడ్ లో మల్టీ టాలెంట్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు అనితా చౌదరి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనిత చౌదరి యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. టాలీవుడ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉంటోంది. అప్పట్లో ఉదయభాను, సుమ, ఝాన్సీ, శిల్పా లాంటి వాళ్లు యాంకర్స్ గా బుల్లితెరను ఏలుతున్న సమయంలోనే అనిత చౌదరి కూడా యాంకర్ గా రాణించారు. ఓవైపు యాంకరింగ్ చేస్తూనే సీరియల్స్ లో కూడా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు వరుస సినిమాల్లో నటిగా ఆకట్టుకున్నారు.