టైట్ గ్రీన్ ఫిట్ లో అలియా భట్ స్టన్నింగ్ లుక్స్.. హాలీవుడ్ ఫిల్మ్ ప్రమోషన్స్ లో అందాల రచ్చ..

First Published | Jun 18, 2023, 6:49 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt)  తర్వలో హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. ఈ స్టార్ బ్యూటీ నటించిన తొలి హాలీవుడ్ ఫిల్మ్ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. 
 

బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది స్టార్ హీరోయిన్ అలియా భట్. ఇక తెలుగు ప్రేక్షకులను కూడా ఈ బ్యూటీ అలరించింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో తెలువారికి బాగా దగ్గరైంది. తన నటనతో ఆకట్టుకుంది.
 

టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్లు అందినా అలియా భట్ ఓకే చెప్పలేదు. అదే సమయంలో  బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ తో వివాహం, ప్రెగ్నెన్సీ తో మరో సినిమా తెలుగులో చేయలేకపోయింది. ఏదేమైనా ఈ ముద్దుగుమ్మ  దక్షిణాది ప్రేక్షకుల్లోనూ మంచి ఫాలోయింగ్ ను దక్కించుకుంది.
 


ఇక ప్రస్తుతం అలియా భట్ తన హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధంగా ఉంది. స్టార్ బ్యూటీ నటించిన తొలి హాలీవుడ్ ఫిల్మ్ విడుదలకు రెడీగా ఉండటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్‌‘ (Heart of stone)లో హాలీవుడ్ నటి గాల్ గాడోట్, జామీ డోర్నన్‌లతో కలిసి అలియా భట్ నటించింది. 
 

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్  కోసం  రూపొందించిన ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను  బ్రెజిల్‌లో నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా అలియా అక్కడే సందడి చేస్తుంది. ఈ క్రమంలో స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది.
 

తాజాగా హార్ట్ ఆఫ్ స్టోన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నుంచి కొన్ని ఫొటోలను పంచుకుంది. ఈ కార్యక్రమంలో అలియా గ్రీన్ టైట్ అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఫొటోలకు మతులు పోయేలా ఫోజులిచ్చింది. గ్లామర్ మెరుపులతో అట్రాక్ట్ చేసింది. 

ఇక హార్ట్ ఆఫ్ స్టోన్ ట్రైలర్ ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ అయ్యింది. దీనికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. సూపర్‌స్పై యాక్షన్-థ్రిల్లర్‌గా తర్వలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి హాలీవుడ్ మూవీ కావడంతో అలియా సూపర్ ఎగ్జైట్ గా ఫీల్ అవుతోంది. ఆమె అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. 
 

Latest Videos

click me!