చీరకట్టులో హోయలు పోయిన డస్కీ బ్యూటీ.. పద్ధతిగానే గుండెల్ని కోస్తున్న ఐశ్వర్య రాజేష్

First Published | Jul 4, 2023, 10:11 AM IST

డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) ట్రెడిషనల్ లుక్ లో ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. గ్లామర్ షోకు దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చింది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది.

తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ప్రస్తుతం కోలీవుడ్, మలయాళంలో  అరడజన్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫ్యాన్స్, ఆడియెన్స్ ను  అలరిస్తోంది. ఈ సందర్భంగా ఆయా ఈవెంట్లకు హాజరవుతూ సందడి చేస్తోంది. 
 

ఇక ఈ టాలెంటెడ్ హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. తెలుగు బ్యూటీ అయినప్పటికీ తమిళ హీరోయిన్ గానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు తెలుగు ప్రేక్షకుల కోసం కూడా టాలీవుడ్ లోనూ వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటోంది. 


రీసెంట్ గా తెలుగు సినిమాల్లో అవకాశాలపైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల తను నటించిన ‘ఫర్హానా’ చిత్రం విడుదల కావడంతో వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత ‘తీరా కాదల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందకు వచ్చింది. 
 

చివరిగా ఈ ముద్దుగుమ్మ ‘రిపబ్లిక్’ మూవీలో నటించింది. ఈ సినిమా ప్రేక్షకుల పరంగా మంచి రెస్పాన్స్ నే దక్కించుకుంది. ప్రస్తుతం మాత్రం తమిళం, మలయాళంలో వరుసపెట్టి చిత్రాలు చేస్తోంది. ఫుల్ బిజీగా మారిపోయింది. ఈక్రమంలో ఫ్యాన్స్ కు సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటోంది.

అయితే,  ఐశ్వర్య రాజేశ్ వరుస చిత్రాలతో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. క్రేజీ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బ్యూటీఫుల్ లుక్స్ లో ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను  అట్రాక్ట్ చేస్తోంది.

తన వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ పంచుకుంటూనే వస్తున్న ఈ ముద్దుగుమ్మ.. మరోవైపు ట్రెడిషనల్ వేర్స్ లో అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ చీరకట్టులో మెరిసింది. బ్లూ కలర్ శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. 

Latest Videos

click me!