బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తన లాంగ్‌టైమ్ పార్ట్‌నర్ గౌరీ స్పాట్‌ను పెళ్లి చేసుకున్నారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తన లాంగ్‌టైమ్ పార్ట్‌నర్ గౌరీ స్పాట్‌ను పెళ్లి చేసుకున్నారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో ఈ రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది. ఈ వేడుక చాలా సింపుల్‌గా, కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితుల మధ్య జరిగింది. వీరిద్దరి స్నేహం పెళ్లి బంధంగా మారడంతో ఈ జంట కొత్త ప్రయాణం మొదలుపెట్టింది.
24
వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్
ఆమిర్ ఖాన్, గౌరీ స్పాట్‌కు ఒకరికొకరు దాదాపు 25 ఏళ్లుగా తెలుసు. కానీ వీరి మధ్య ప్రేమ చిగురించింది మాత్రం చాలా ఆలస్యంగా. 2024లో బెంగళూరులో ఆమిర్ కజిన్ నుజాత్ ఖాన్ ద్వారా మళ్లీ కలుసుకున్నారు. దాదాపు ఏడాది పాటు లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాక, తమ బంధాన్ని బయటపెట్టారు. 2025 మార్చిలో తన 60వ పుట్టినరోజున గౌరీని తన పార్ట్‌నర్‌గా ఆమిర్ పరిచయం చేశారు. ఆ తర్వాత గౌరీ తన కొడుకుతో కలిసి బెంగళూరు నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యారు. హెయిర్‌కేర్ కంపెనీలో ఉద్యోగం మానేసి, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో చేరారు. వీరిద్దరి మధ్య 13 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. మార్చి 14, 1965న పుట్టిన ఆమిర్ వయసు 61 కాగా, ఆగస్టు 21, 1978న పుట్టిన గౌరీ వయసు 47.
34
ఆమిర్ పిల్లలు
ఈ పెళ్లి వేడుకను ఆడంబరంగా కాకుండా, చాలా ప్రైవేట్‌గా జరిపించారు. ఆమిర్ పిల్లలు ఇరా ఖాన్, జునైద్ ఖాన్ ఈ వేడుకకు హాజరై తండ్రి సంతోషంలో పాలుపంచుకున్నారు. సినీ పరిశ్రమ నుంచి కొద్దిమంది స్నేహితులు కూడా వచ్చారు. 'లగాన్' డైరెక్టర్ అశుతోష్ గోవారికర్, '3 ఇడియట్స్' డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ, నటి ఎల్లీ అవ్రామ్ ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఇది ఆమిర్ ఖాన్‌కు మూడో పెళ్లి. మొదట రీనా దత్తాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇరా, జునైద్ అనే ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత 'లగాన్' సినిమా టైంలో పరిచయమైన కిరణ్ రావును 2005లో పెళ్లి చేసుకున్నారు. 2011లో సరోగసీ ద్వారా వీరికి ఆజాద్ రావు ఖాన్ పుట్టాడు. 16 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత 2021లో ఆమిర్, కిరణ్ విడిపోయారు. విడిపోయినా కూడా స్నేహంగా ఉంటూ, కొడుకు ఆజాద్‌ను కలిసి పెంచుతున్నారు. ఇప్పుడు గౌరీ స్పాట్‌ను పెళ్లి చేసుకుని ఆమిర్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు.