కాగా, ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ చిత్రంలో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, వండర్ వుమెన్’ సినిమాలతో హాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన హీరోయిన్ గాల్ గ్యాడట్‌తో కలిసి అలియా నటించనుంది. గాల్ గ్యాడెట్, ఆమె భర్త జేరన్ వార్సనో కలిసి నెట్‌ఫ్లిక్స్ కోసం ఈ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అలియా భట్ తన మొట్టమొదటి హాలీవుడ్ చిత్ర షూటింగ్ కు బయలుదేరింది. ఈ సందర్భంగా తనకు కలిసి ఫీలింగ్ ను అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ కూడా పెట్టింది.