ఏ.ఆర్‌. రెహ్మాన్‌.. భారతీయ సంగీతం చేసుకున్న అదృష్టం.. సూటిగా, సుత్తిలేకుండా!

Published : Jan 06, 2021, 01:10 PM IST

ఆస్కార్‌ విన్నర్‌, లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌, అద్భుతమైన గాయకుడు ఏ.ఆర్‌. రెహ్మాన్‌ మన ఇండియాకి చెందిన సంగీత దర్శకుడు కావడం మన అదృష్టం. మూడు దశాబ్దాలుగా ఇండియన్‌ సినిమాని తన వినసొంపైన సంగీతం ఒలలాడిస్తున్నారు. మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. `రోజా` సినిమాతో సంగీత ప్రస్థానాన్ని కొనసాగించిన ఆయన తొలి సినిమాతోనే యావత్‌ దేశ సినీ సంగీత ప్రియులను ఆకర్షించారు. తొలి ఆల్బమ్‌తోనే చరిత్ర సృష్టించారు. నేడు(బుధవారం) రెహ్మాన్‌ పుట్టిన రోజు. 

PREV
111
ఏ.ఆర్‌. రెహ్మాన్‌.. భారతీయ సంగీతం చేసుకున్న అదృష్టం.. సూటిగా, సుత్తిలేకుండా!
`రోజా` సినిమాలోని పాటలు ఇప్పటికీ ఫేమస్సే. తమిళం, హిందీతోపాటు తెలుగు, మలయాళం, చైనీస్‌, ఇంగ్లీష్‌ భాషల్లో కూడా సంగీతం అందించి తన సత్తాని, ప్రతిభని చాటారు. ఇప్పటి వరకు 146కుపైగా సినిమాకు సంగీతాన్ని అందించారు. 284కిపైగా సౌండ్‌ ట్రాక్‌లు అందించారు. ఆరు పాటలు స్వయంగా రాశారు. 20 ఆల్బమ్స్ చేశారు.

211
లవ్‌, రొమాంటిక్‌ సాంగ్‌లు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన రొమాంటిక్‌ పాటలు శ్రోతలను మంత్రముగ్దుల్ని చేస్తుంటాయి. తన అద్భుతమైన సంగీతంతో ప్రపంచ శ్రోతలను మెప్పించిన రెహ్మాన్‌ `స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌` చిత్రానికిగానూ బెస్ట్ ఒరిజినల్‌ స్కోర్‌, బెస్ట్ సాంగ్‌ లకు రెండు ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకుంది. ఐదుసార్లు ఆయన ఆస్కార్కి నామినేట్‌ అయ్యారు.

311
వీటితోపాటు ఒక బ్రిటీష్‌ అకాడమీ అవార్డు, ఒక గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం, రెండు గ్రామీ అవార్డులు, అనేక ఇతర అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.

411
ఇక ఇండియా నుంచి `రోజా`, `మిన్సారా కానవు`, `లగాన్‌`, `కన్నథిల్‌ ముథమిట్టాల్‌`, `కాట్రు వెలియదై`, `మామ్‌` చిత్రాలకుగానూ ఆరు జాతీయ అవార్డులు అందుకున్నారు. వీటితోపాటు భారతీయ సంగీతానికి, సినీ రంగానికి ఆయన చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం 2000లో పద్మశ్రీ పురస్కారంతో, 2020లో పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది.

511
రెహ్మాన్‌ సంగీతం అందించిన తెలుగు పాటలను ఓ సారి చూస్తే, `పరువమ్‌ వానగా..`, `ఓ చెలియా.. ప్రియ సఖియా.. `, `ససివదనే.. `, `వింటున్నావా..`, `లాలీ.. లాలీ..`, `వెళ్లిపోమాకే..`, `చిన్న చిన్న ఆశా..`, `అందమైన ప్రేమరాణి..`, `తియ తీయని..`, `నువ్వంటే నా జతగా..`, `ఊర్వశి.. ఊర్వశి`, `ప్రేమించే ప్రేమవో..`, `చికు బుకు రైలే..`, `పువ్వుల్లో దాగున్నా..` , `నా ఇంటి ముందున్నా.. `నీలి కనుమల్లో.. `, `అందాలరాక్షసివే..`, `వాలు కనులదానా..`, `మల్లికలే నా ఆశలా..`, `నా చెలి రోజావే..` ఇలా చెప్పుకుంటూ పోతే వందలపాటలు కనిపిస్తాయి. ఆయన కంపోజ్‌ చేసిన ప్రతి పాట మనసుని తాకుతుంది. మదిలో చిరకాలం నిలిచిపోతుంది.

611
సినిమాలు కాదు, ఆయన పాటలే పాపులర్‌, ఆయన పాటే ఓ స్పెషల్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేస్తుంది. సినిమాకి అతీతంగా పాట గుర్తిండిపోతుంది. సినిమాకే వన్నె తెస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మణిరత్నం, శంకర్‌ దర్శకులకు సొంత మ్యూజిక్‌ డైరెక్టర్‌గా రాణిస్తుంటారు రెహ్మాన్‌. ప్రస్తుతం అరడజనుకుపైగా సినిమాలకు సంగీతం అందిస్తూ నిత్యం బిజీగా ఉంటారు రెహ్మాన్‌.

711
అయితే రెహ్మాన్‌ జీవితంలో ఈ పుట్టిన రోజు చాలా బాధని మిగిల్చింది. పది రోజుల క్రితం ఆయన తల్లి కరీమా కన్నుమూశారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో పెంచి పెద్దచేయడంతోపాటు ఆయన కెరీర్‌ని తీర్చిదిద్దడంలో, తనకు బ్యాక్‌ బోన్‌లా ఉండటంలో ఆమె పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆమె లేనిదే, రెహ్మాన్‌ లేడు. అలాంటి తల్లి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు రెహ్మాన్‌.

811
ఇదిలా రెహ్మాన్‌ బర్త్ డే సందర్భంగా ఆయనకు మహేష్‌బాబుతోపాటు అనేక మంది తారలు బర్త్ డే విషెస్‌ తెలియజేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌, మాలీవుడ్‌ సినీ ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

911
భారతీయ సంగీతంలో తనదైన ముద్ర వేసుకున్న స్వర మాంత్రికుడు రెహ్మాన్‌.. ట్రెడిషనల్‌ క్లాసిక్స్ నుంచి పాప్‌ మ్యూజిక్‌ వరకు అన్నీ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అన్నింటిలోనూ ఆరితేరారు. సినిమా సినిమాకి ఫ్రెష్‌ ఫీలింగ్‌ని తీసుకురావడం ఆయనకే సాధ్యం. ఆయన తన ప్రతి ఆల్బం తో ఒక ట్రెండ్ క్రియేట్‌ చేస్తుంటారు. భవిష్యత్‌ సంగీతాన్ని ముందే ఊహించి తన సినిమాల్లో వాటికి ప్రాణం పోస్తుంటారు.

1011
ఇప్పటితరం మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఏ ఒక్కరు కూడా రెహమాన్ ని అందుకోలేరు అన్నది వాస్తవం. రెహమాన్ సృష్టించిన మేనియా అలాంటిది. రెహమాన్ కంపోజ్ చేసిన ప్రతి పాటా ప్రత్యేకమే. మనసును తాకే మధురమైన సంగీతాన్నే కాదు.. హుషారెత్తించే ఫాస్ట్ బీట్స్ కూడా కంపోజ్ చేసి చిందులేయించాడు.

1111
ఇండియాలో మ్యూజిక్ అంటే రెహమాన్ అనేలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అలాంటి రెహ్మాన్‌ ఇలాంటి పుట్టిన రోజులు మరిన్నిజరుపుకోవాలని కోరుకుందాం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories