Balakrishna దృష్టిలో పడితే చాలు మీ లైఫ్‌ మారిపోయినట్టే.. క్యారెక్టర్స్ చేసిన హీరో విషయంలో జరిగింది ఇదే

Published : May 16, 2026, 04:20 PM IST

Balakrishna: బాలకృష్ణ దృష్టిలో పడితే ఏ నటుడి లైఫ్‌ అయినా మారిపోతుందట. అదృష్టం వరిస్తుందట. ఒక క్యారెక్టర్స్ చేసే నటుడి విషయంలో ఇదే జరిగింది. ఆ విషయాన్ని బాలయ్య తెలిపారు. 

PREV
15
టాప్‌ హీరోగా రాణిస్తోన్న బాలకృష్ణ

బాలకృష్ణ టాలీవుడ్‌ టాప్‌ హీరోల్లో ఒకరు. గత ఐదు దశాబ్దాలుగా హీరోగా రాణిస్తున్నారు. కుర్ర హీరోలు పాన్‌ ఇండియా సినిమాలతో రచ్చ చేస్తున్నా, తాను కూడా ఏమాత్రం తగ్గడం లేదు. వారికీ పోటీ ఇస్తున్నారు. ఇప్పటికే అదిరిపోయే లైనప్‌తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో బాలయ్యకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆయన దృష్టిలో పడితే నటుల లైఫ్‌ మారిపోతుందట. ఓ హీరో విషయంలో అదే జరిగిందట. స్వయంగా బాలయ్యనే ఈ విషయాన్ని వెల్లడించారు.

25
క్యారెక్టర్స్ చేస్తూ, హీరోగా టర్న్ తీసుకున్న శ్రీహరి

నటుడు శ్రీహరి ఒకప్పుడు హీరోగా చేశారు, అదే సమయంలో క్యారెక్టర్స్ కూడా చేశారు. విలన్‌గా కెరీర్‌ని ప్రారంభించి హీరోగా టర్న్ తీసుకుని వరుసగా సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. స్టార్‌ హీరోగా రాణించారు. మాస్‌ యాక్షన్‌ సినిమాలతోపాటు ఫ్యామిలీ చిత్రాలు చేశారు. లెఫ్ట్ భావజాలం ఉన్న చిత్రాలు కూడా చేసి మెప్పించారు. చాలా వరకు సక్సెస్‌ అయ్యారు. ఓ దశలో హీరోగా కెరీర్‌లో పీక్‌ని చూశారు. అయితే సినిమాలు ఆడకపోవడంతో క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకున్నారు. ఇలా హీరోగా, క్యారెక్టర్స్ చేస్తూ కెరీర్‌ ని బ్యాలెన్స్ చేశారు.

35
బాలకృష్ణ చెప్పడం వల్లే శ్రీహరి మగధీర చేశాడా?

శ్రీహరి క్యారెక్టర్స్ చేసిన చిత్రాల్లో `మగధీర` ఒకటి. ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ షేర్‌ ఖాన్ పాత్రలో నటించారు. రామ్‌ చరణ్‌తో పోరాడే పాత్ర. రామ్‌ చరణ్‌ యాక్షన్‌కి ఫిదా అయిన పాత్ర. హీరో తర్వాత హీరో రేంజ్‌లో ఆయన పాత్ర ఉంటుంది. ఇందులో రామ్‌ చరణ్‌తోపాటు శ్రీహరి కూడా డబుల్‌ రోల్‌ చేశారు. షేర్‌ ఖాన్‌గా, సోల్మన్‌గా అదరగొట్టారు. చరణ్‌తో కలిసి డాన్స్ కూడా చేశారు . ఈ సినిమా విజయంలో శ్రీహరి పాత్ర చాలా కీలకంగా నిలుస్తుంది. ఆయన లేకుండా ఈ మూవీ సక్సెస్‌ని ఊహించుకోలేం, ఆ పాత్రలో మరే నటుడిని ఊహించుకోలేం.

45
బాలకృష్ణ దృష్టిలో పడితే లైఫ్‌ సెట్‌

`మగధీర`లో ఈ పాత్ర చేయడానికి మొదట శ్రీహరి వెనకడుగు వేశాడట. అటు ఆయన భార్య డిస్కో శాంతి కూడా నో చెప్పిందట. కానీ బాలయ్య చెప్పడం వల్ల చేశాడట శ్రీహరి. ఈ ప్రస్తావన బాలకృష్ణ వద్ద వచ్చింది. ఈ పాత్ర చేయి బ్రదర్‌, మీకు మంచి పేరొస్తుందని అన్నారట. ఆయన చెప్పడం వల్లే శ్రీహరి ఆ సినిమా చేశారట. దీనిపై బాలయ్య మాట్లాడుతూ, ఫిజిక్‌ ఉన్నవాడికి టాలెంట్‌ ఉండదు. వాళ్లకి మోకాళ్లలో ఉంటుందంటారు. కానీ ఆయనకు మంచి టాలెంట్‌ ఉంది. బ్రదర్‌ మీరు ఆ సినిమా చేయండి, మీకు మంచి పేరొస్తుంది, లైఫ్‌ మారిపోతుందని చెప్పాను. నా మాట విని చేశాడు. ఆయన లైఫే మారిపోయింది. ఆ తర్వాత హీరోగా సినిమాలు చేశాడు. అయితే ఆ తర్వాత చాలా మంది ఆఫర్లు ఇవ్వాలని శ్రీహరిని అడిగితే ఆయన చెప్పేది ఒక్కటే.. నన్ను అడగడం కాదు, వెళ్లి బాలకృష్ణ దృష్టిలో పడండి, మీ లైఫ్‌ మారిపోతుంది, మీకు అదృష్టం కలిసి వచ్చినట్టే` అని శ్రీహరి చెప్పేవారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ వెల్లడించారు.

55
బాలయ్య నెక్ట్స్ సినిమాలు

శ్రీహరి అనారోగ్యంతో 2013లో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకి తీరని లోటు. ఒక ప్రత్యేకమైన పాత్రలకు శ్రీహరి కేరాఫ్‌. అలాంటి రోల్స్ ని భర్తీ చేసే నటుడు ఇప్పటికీ రాలేదని చెప్పొచ్చు. ఇక బాలకృష్ణ.. ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత కొరటాల శివ, వివేక్‌ ఆత్రేయ వంటి దర్శకులతో సినిమాలు చేయబోతున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories