Published : Aug 08, 2023, 02:44 PM ISTUpdated : Aug 08, 2023, 02:50 PM IST
ఎందరో మహనీయుల త్యాగ ఫలం ఈ స్వాతంత్య్రం. వీరులు తమ ఊపిరి వదిలి భరతమాతను దాస్య శృంఖలాల నుండి విడిపించారు. పుట్టిన నేల తల్లికి స్వేచ్ఛా వాయువు అందించారు. దొరల దోపిడీ, దురాగతాలకు అడ్డుకట్ట వేశారు. బ్రిటిష్ కోటలు బద్దలు కొట్టి మువ్వన్నెల జెండా ఎగరేశారు.
ఎందరో మహనీయుల త్యాగ ఫలం ఈ స్వాతంత్య్రం. వీరులు తమ ఊపిరి వదిలి భరతమాతను దాస్య శృంఖలాల నుండి విడిపించారు. పుట్టిన నేల తల్లికి స్వేచ్ఛా వాయువు అందించారు. దొరల దోపిడీ, దురాగతాలకు అడ్డుకట్ట వేశారు. బ్రిటిష్ కోటలు బద్దలు కొట్టి మువ్వన్నెల జెండా ఎగరేశారు.
27
Best Telugu Freedom Fighters Biopics
వీరపాండ్య కట్ట బ్రహ్మన (1959)
తమిళ చిత్రం వీరపాండ్య కట్టబొమ్మన్ తెలుగులో వీరపాండ్య కట్ట బ్రహ్మనగా విడుదలైంది. ఇది 18వ శతాబ్దంలో తమిళ రాజ్య పాలకుడిగా ఉన్న కట్ట బొమ్మన్ బయోపిక్. బ్రిటీష్ దొరల ఆధిపత్యాన్ని ప్రశ్నించిన వీరుడి కథ. శివాజీ గణేశన్, జెమినీ గణేష్ ప్రధాన పాత్రలు చేశారు. బి ఆర్ పంతులు ఈ చిత్ర దర్శకుడు.
37
Best Telugu Freedom Fighters Biopics
అల్లూరి సీతారామరాజు (1974)
సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో మైలురాయిలా నిలిచింది అల్లూరి సీతారామరాజు. బ్రిటీష్ పాలకుల దురాగతాలకు వ్యతిరేకంగా సమర శంఖం పూరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. తెలుగునేలపై పుట్టిన స్వాతంత్య్ర సమర యోధుడి తాగ్యాన్ని తెలుగు ప్రజలకు అద్భుతంగా ఈ మూవీతో కృష్ణ తెలియజేశారు. ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ మూవీ అనేక అవార్డ్స్, రివార్డ్స్ సొంతం చేసుకుంది. వి. రామచంద్రరావు అల్లూరి సీతారామరాజు చిత్రానికి దర్శకత్వం వహించారు.
47
Best Telugu Freedom Fighters Biopics
ఆంధ్రకేసరి (1983)
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు బయోపిక్. విజయ్ చందర్ ఈ చిత్ర దర్శక నిర్మాతగా వ్యవహరించారు. విజయ్ చందర్ టంగుటూరి పాత్రలో నటించడం మరొక విశేషం. దేశభక్తుడైన టంగుటూరి మద్రాస్ ప్రెసిడెన్సీ, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
57
Best Telugu Freedom Fighters Biopics
రాజన్న (2011)
ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన బయోపిక్ రాజన్న. ఇది తెలంగాణా ప్రాంతానికి చెందిన ఉద్యమకారుడు సుద్దాల హనుమంత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. బ్రిటిష్ రాజు పాలనకు వ్యతిరేకంగా రజాకార్ ఉద్యమాన్ని నడిపారు. టైటిల్ రోల్ లో నాగార్జున నటించారు. బేబీ అన్నీ కీలక రోల్ చేయగా, స్నేహ రాజన్న భార్య పాత్ర చేసింది.
67
సైరా (2019)
రాయలసీమ విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన భారీ చిత్రం సైరా. చిరంజీవి సైరా నరసింహారెడ్డి పాత్ర చేశారు. నయనతార, తమన్నా హీరోయిన్స్ గా నటించారు. చిరంజీవి కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సైరా నిలిచింది. బ్రిటీష్ ఆధిపత్యాన్ని ఎదిరించి చుక్కలు చూపించిన నరసింహారెడ్డి ఉరి తీయబడ్డాడు.
77
మేజర్ (2022)
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథగా తెరకెక్కింది మేజర్ మూవీ. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. మేజర్ ఉన్ని కృష్ణన్ తెగువను దేశం మొత్తం కీర్తించింది. మేజర్ మూవీలో అడివి శేష్ హీరోగా నటించారు. ఈ చిత్రాన్ని హీరో మహేష్ నిర్మించడం విశేషం.