'ఏజెంట్' మూవీ చూడడానికి 5 కారణాలు, కొండంత ఆశలతో అఖిల్..అంతా ఘనంగానే ఉంది, లోపల మ్యాటరే ముఖ్యం

Published : Apr 27, 2023, 07:23 PM IST

అక్కినేని వారసుడు అఖిల్ చేస్తున్న భారీ ప్రయత్నం 'ఏజెంట్'. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టేశాడు అనే చెప్పాలి.

PREV
17
'ఏజెంట్' మూవీ చూడడానికి 5 కారణాలు, కొండంత ఆశలతో అఖిల్..అంతా ఘనంగానే ఉంది, లోపల మ్యాటరే ముఖ్యం

అక్కినేని వారసుడు అఖిల్ చేస్తున్న భారీ ప్రయత్నం 'ఏజెంట్'. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టేశాడు అనే చెప్పాలి. దాదాపు ఏడాది సమయం అఖిల్ ఈ మూవీ కోసం శ్రమించాడు. అఖిల్ కి ఇంతవరకు సాలిడ్ హిట్ అంటూ పడలేదు. ఏజెంట్ మూవీకూడా అఖిల్ మార్కెట్ స్థాయికి మించిన బడ్జెట్ లో నిర్మించారనే ప్రచారం జరుగుతోంది. ఇదంతా పక్కన పెడితే అక్కినేని ఫ్యాన్స్ ఆశపడుతున్నట్లు అఖిల్ స్టార్ హీరోగా ఎమెర్జ్ కావాలంటే ఏజెంట్ మూవీ తప్పనిసరిగా బ్లాక్ బస్టర్ కావాలి. 

27

ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రతిదీ అదిరిపోయింది. ఇక అఖిల్ ఏజెంట్ గా థియేటర్స్ లో రచ్చ చేయడమే మిగిలి ఉంది. మరికొన్ని గంటల్లోనే ఏజెంట్ చిత్ర షోలు వరల్డ్ వైడ్ గా మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెంట్ చిత్రాన్ని తప్పనిసరిగా చూసేందుకు ఆకర్షిస్తున్న అంశాలు ఏంటో చూద్దాం. 

37

అఖిల్ డెడికేషన్: ఏజెంట్ చిత్రం లో అఖిల్ కష్టం గురించి చెప్పాలంటే ఒళ్ళు హూనం చేసుకున్నాడనే చెప్పాలి. ఎందుకంటే అఖిల్ ఏడాది పాటు సిక్స్ ప్యాక్ మైంటైన్ చేస్తూ.. బాడీ ఫిట్నెస్ కాపాడుకుంటూ వచ్చాడు. అఖిల్ ఒక స్టూడెంట్ లాగా సురేందర్ రెడ్డి చెప్పిందల్లా చేశాడు. అఖిల్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ లో పెర్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. అఖిల్ డెడికేషన్ కి, శ్రమకి తగ్గ ఫలితం ఏజెంట్ చిత్రంతో దక్కాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. 

47

సురేందర్ రెడ్డి :ఒక రకంగా చెప్పాలంటే ఏజెంట్ మూవీ భారం మొత్తం డైరెక్టర్ సురేందర్ రెడ్డిదే అని చెప్పాలి. సురేందర్ రెడ్డి చిత్రం అంటే మినిమమ్ గ్యారెంటీ వినోదం అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఆ నమ్మకంతోనే నిర్మాత అఖిల్ మార్కెట్ స్థాయికి మించి ఈ చిత్రానికి ఖర్చు చేసినట్లు టాక్. ట్రైలర్ టీజర్స్ లో సురేందర్ రెడ్డి మార్క్ కనిపిస్తోంది. ఆయన చిత్రాల్లో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో ఎంటర్టైన్మెంట్ కూడా అలాగే ఉంటుంది. మరి ఈ స్పై థ్రిల్లర్ ని ఎలా డీల్ చేశారో మరికొన్ని గంటల్లో తేలనుంది. 

57

స్పై థ్రిల్లర్స్ హంగామా : ప్రస్తుతం ఇండియన్ సినిమాలో స్పై థ్రిల్లర్ చిత్రాల ఫీవర్ కాస్త గట్టిగానే కనిపిస్తోంది. ఆ మధ్యన విడుదలైన షారుఖ్ పఠాన్ చిత్రం ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా సంచనలం సృష్టించింది. ఇది ఏజెంట్ చిత్రానికి కలసి వచ్చే అంశమే. ట్రెండు కొనసాగుతోంది కాబట్టి కంటెంట్ బావుంటే అద్భుతాలు జరగొచ్చు. 

67

యాక్షన్ ఎపిసోడ్స్: ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అఖిల్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ అనే ప్రచారం జరుగుతోంది. ట్రైలర్ లో కూడా యాక్షన్ సన్నివేశాలని హైలైట్ చేశారు. రెగ్యులర్ ఇంటెర్వల్స్ లో మంచి యాక్షన్ సన్నివేశాలు ఉంటే సినిమా సగం హిట్టయినట్లే. 

77

ప్రొడక్షన్ వాల్యూస్: ఈ చిత్రాన్ని అనిల్ సుంకర తన ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. అఖిల్ గత చిత్రాల రిజల్ట్ ని పక్కన పెట్టి డైరెక్టర్ సురేందర్ రెడ్డి మీద నమ్మకంతో ఆయన ఈ చిత్రం కోసం భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సో ప్రొడక్షన్ వాల్యూస్ తప్పనిసరిగా అద్భుతంగా ఉంటాయి. మరికొన్నిగంటల్లో ఈ చిత్రానికి ఆడియన్స్ ఇవ్వబోయే రెస్పాన్స్ పైనే అందరి దృష్టి ఉంది. ఏజెంట్ అయితే పైకి ఘనంగానే కనిపిస్తున్నాడు. ఈ చిత్ర విజయాన్ని డిసైడ్ చేసేది లోపల ఉన్న కంటెంట్ మాత్రమే. 

click me!

Recommended Stories