సక్సెస్ కోసం రూటు మార్చిన స్టార్ హీరోలు

First Published Mar 2, 2020, 9:43 AM IST

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ని కంటిన్యూ చేయడమంటే చాలా కష్టమైన పని. అభిమానుల అంచనాలను మించి అడుగులు వేస్తే గాని హ్యాపీగా ఉండలేరు. అయితే గతకొంత కాలంగా సక్సెస్ లేక సతమతమవుతున్న కొంత మంది కుర్ర హీరోలు ఇప్పుడు ఎవరు ఊహించని కథలతో సిద్ధమవుతున్నారు. 

అక్కినేని అఖిల్: మొదటి సినిమా అఖిల్ నుంచి ఈ స్టార్ కిడ్ కోలుకోలేని పరిస్థితి. హలో - మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ కావడంతో సక్సెస్ అతనికి అందనిద్రాక్షల మారింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లవ్ యాంగిల్ తో ఎమోషనల్ కంటెంట్ ని ప్రజెంట్ చేయబోతున్నారట.
undefined
రవితేజ: రాజా ది గ్రేట్ అనంతర సక్సెస్ ట్రాక్ ఎక్కాడనుకున్న మాస్ రాజా మళ్ళీ నెల టిక్కెట్టు - టచ్ చేసి చూడు - అమర్ అక్బర్ ఆంటోని సినిమాలతో డిజాస్టర్ ఊబిలో ఇరుక్కుపోయాడు. డిస్కో రాజా కూడా దెబ్బ కొట్టింది. నెక్స్ట్ క్రాక్ సినిమాతో అయినా మంచి సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్నాడు.
undefined
గోపీచంద్: మంచి మాస్ ఫాలోయిన్ సినిమాలతో ఒకప్పుడు తనకంటూ ఒక మార్కెట్ సెట్ చేసుకున్న గోపీచంద్ సక్సెస్ ని చూసి చాలా కాలమవుతోంది. ఆక్సిజన్ - గౌతమ్ నందా - పంతం సినిమాలు ఏవి కూడా మనోడికి సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో ఒక స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు.
undefined
మంచు మనోజ్: ఈ యువ హీరో ఎలాంటి ప్రయోగాలు చేసినా వర్కౌట్ అవ్వడం లేదు. కరెంట్ తీగ తరువాత చేసిన అయిదు సినిమాలు బిగ్ డిజాస్టర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం ఒక సీరియస్ థ్రిల్లర్ జనార్ లో డిఫరెంట్ కథతో రెడీ అవుతున్నాడు.
undefined
శర్వానంద్: శతమానం భవతి - మహానుభావుడు సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న శర్వా ఆ తరువాత చేసిన పడి పడి లేచే మనసు - రణరంగం సినిమాలు భారీ నష్టాలతో షాకిచ్చాయి. 96 రీమేక్ జాను కూడా బెడిసికొట్టింది. ఇప్పుడు వ్యవసాయం కాన్సెప్ట్ తో శ్రీకారం అనే సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు.
undefined
రాజ్ తరుణ్: కెరీర్ మొదట్లో హ్యాట్రిక్ విజయాలతో అందరిని ఆకర్షించిన యువ హీరో తరుణ్ భాస్కర్ ఆ తరువాత వరుసగా 6 సినిమాలతో దెబ్బ తిన్నాడు. ప్రస్తుతం 'ఒరేయ్ బుజ్జిగా' అనే సినిమాతో బిజిగా ఉన్నాడు.
undefined
అల్లరి నరేష్: సుడిగాడు సినిమా తరువాత పదికి పైగా సినిమాలు చేసిన నరేష్ మళ్ళీ ఆ స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. రీసెంట్ గా మహేష్ మహర్షి సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేసి పరవాలేధనిపించాడు. నెక్స్ట్ 'నాంది' అనే సినిమాతో సక్సెస్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు. అలాగే సుడిగాడు సినిమాకు సీక్వెల్ చేసేందుకు కూడా నరేష్ ప్లాన్ చేస్తున్నాడు.
undefined
ఆది: ప్రేమ కావాలి - లవ్లీ సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకోని సెట్టయ్యాడనుకున్న ఆది సాయి కుమార్ ఆ తరువాత వరుసగా 8 సినిమాలతో దెబ్బ తిన్నాడు. ప్రస్తుతం ఈ హీరో కూడా థ్రిల్లర్ కథల కోసం వెతుకుతున్నాడు.
undefined
అల్లు శిరీష్: 5 సినిమాలతో ఆడియెన్స్ ని మెప్పించే ప్రయత్నం చేసిన అల్లు శిరీష్ శ్రీ రస్తు శుభమస్తు సినిమాతో మాత్రమే కాస్త పాజిటివ్ టాక్ ను అందుకున్నాడు. ఇక ఆ తరువాత చేసిన ఒక్క క్షణం - ఎబిసిడి సినిమాలు ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం శిరీష్ రాక్షసుడు డైరెక్టర్ రమేష్ వర్మతో కొత్త ప్రాజెక్ట్ ను సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు.
undefined
click me!