హిట్టుతో వరస ఫ్లాపుల దెబ్బ.. కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టింది!

First Published Nov 1, 2019, 12:26 PM IST

ప్రతీ ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు అనేవి ఉంటాయి. ఓ సారి సక్సెస్ వరిస్తే మరోసారి ఫ్లాప్ ఎదురవుతుంటుంది. మన హీరోలు కూడా దీనికి మినహాయింపు కాదు. 

ప్రతీ ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు అనేవి ఉంటాయి. ఓ సారి సక్సెస్ వరిస్తే మరోసారి ఫ్లాప్ ఎదురవుతుంటుంది. మన హీరోలు కూడా దీనికి మినహాయింపు కాదు. చిరంజీవి, బాలయ్య నుండి మహేష్, పవన్ కళ్యాణ్ వరకు అందరూ ఒక స్టేజ్ లో ఫ్లాప్స్ రుచి చూడాల్సి వచ్చింది. అలా అని సినిమాలకు దూరం కాకుండా హిట్టు కొట్టే వరకు ప్రయత్నాలు చేసి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఒక హిట్టు ముందు మన హీరోలు ఫేస్ చేసిన బ్యాడ్ ఫేస్, ఆ సమయంలో వచ్చిన ఫ్లాప్ సినిమాలు ఎన్నో ఇప్పుడు చూద్దాం!
undefined
చిరంజీవి - 'చూడాలనివుంది' సినిమా తరువాత ఆ రేంజ్ లో హిట్ అందుకోవడానికి చిరుకి చాలా సమయం పట్టింది. నాలుగు ఫ్లాప్ లు, రెండు ఏవరేజ్ ల తరువాత 'ఇంద్ర'తో హిట్ అందుకున్నాడు.
undefined
బాలకృష్ణ - 'లక్ష్మీ నరసింహ' సినిమా తరువాత 'సింహా'తో హిట్ ఆడుకోవడానికి బాలయ్య ఎక్కువ సమయం పట్టింది. మధ్యలో ఏడు ఫ్లాప్ సినిమాలు చేశాడు.
undefined
పవన్ కళ్యాణ్ - 'ఖుషి' లాంటి సినిమా తరువాత పవన్ వరుసగా చేసిన 'జానీ', 'గుడుంబా శంకర్', 'బాలు', 'బంగారం', 'అన్నవరం' ఇలా 5 ఫ్లాప్స్ పడ్డాయి. చివరికి త్రివిక్రమ్ 'జల్సా' తో సక్సెస్ అనుకున్నాడు. ఆ తరువాత మళ్లీ మూడు ఫ్లాప్స్ పడ్డాయి. ఫైనల్ గా 'గబ్బర్ సింగ్' తో హిట్టు కొట్టాడు.
undefined
వెంకటేష్ - 'తులసి' సినిమా తరువాత వెంకీకి ఫ్లాప్స్ తప్పలేదు. ఇక మహేష్ తో చేసిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో వెంకీ తన మార్క్ చూపించాడు.
undefined
నాగార్జున - 'కింగ్' సినిమా తరువాత నాగార్జునకి వరుసగా తొమ్మిది ఫ్లాప్స్ పడ్డాయి. ఇందులో మూడు ఏవరేజ్ సినిమాలు ఉన్నాయి. ఫైనల్ గా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో 'మనం' హిట్ ఇవ్వడమే కాకుండా అక్కినేని ఫ్యామిలీకి స్పెషల్ మూవీగా నిలిచిపోయింది.
undefined
మహేష్ బాబు - 'ఒక్కడు' సినిమా తరువాత మహేష్ బాబుకి 'నిజం', 'నాని' 'అర్జున్' లాంటి ఘోరమైన ఫ్లాప్స్ చవిచూడాల్సి వచ్చింది. ఈ మూడు ఫ్లాప్స్ తరువాత వచ్చిన 'అతడు' సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుంది.
undefined
నితిన్ - ఇండస్ట్రీలో ఏ హీరో చేయనన్ని ఫ్లాప్ సినిమాలు చేశాడు నితిన్. 'సై' సినిమా తరువాత దాదాపు పన్నెండు ఫ్లాప్ సినిమాలు చేసిన తరువాత అప్పుడు 'ఇష్క్'తో హిట్టు కొట్టాడు.
undefined
రవితేజ - 'మిరపకాయ' సినిమా తరువాత ఐదు ఫ్లాప్ సినిమాలు చేశాడు ఈ మాస్ హీరో. ఫైనల్ గా 'బలుపు' తో సక్సెస్ అందుకున్నాడు.
undefined
జూనియర్ ఎన్టీఆర్ - రాజమౌళితో 'సింహాద్రి' సినిమా చేసిన తరువాత ఎన్టీఆర్ కి వరుసగా ఆరు ఫ్లాప్స్ పడ్డాయి. మళ్లీ రాజమౌళితోనే 'యమదొంగ' సినిమా చేసి సక్సెస్ బాటలో పడ్డాడు.
undefined
నాగచైతన్య - 'ప్రేమమ్'తో సక్సెస్ అందుకున్న తరువాత చైతుకి మరో సక్సెస్ చాలా కాలానికి గానీ రాలేదు. వరుసగా ఐదు ఫ్లాప్ సినిమాలు చేశాడు. ఫైనల్ గా 'మజిలీ' సినిమాతో సక్సెస్ కొట్టాడు.
undefined
కళ్యాణ్ రామ్ - 'అతనొక్కడే' సినిమా తరువాత వరుసగా 7 ఫ్లాప్ సినిమాలు చేశాడు కళ్యాణ్ రామ్. ఆ తరువాత అనీల్ రావిపూడి డైరెక్షన్ లో చేసిన 'పటాస్'తో హిట్ అందుకున్నాడు.
undefined
ప్రభాస్ - రాజమౌళితో 'చత్రపతి' సినిమా చేసిన ప్రభాస్ కి ఆ తరువాత అన్నీ ఫ్లాప్సే దాదాపు ఐదు ఫ్లాప్ సినిమాలు, రెండు ఏవరేజ్ సినిమాలు చేసిన తరువాత 'డార్లింగ్' సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు.
undefined
నాని - 'ఈగ' సినిమా నుండి 'భలే భలే మగాడివోయ్' సినిమా వరకు మధ్యలో నానికి నాలుగు ఫ్లాప్ సినిమాలు పడ్డాయి. 'ఎవడే సుబ్రహ్మణ్యం' మాత్రం ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది.
undefined
శర్వానంద్ - 'ప్రస్థానం' హిట్ తరువాత శర్వాకి మరో హిట్ అందుకోవడానికి చాలా సమయం పట్టింది. దాదాపు నాలుగు ఫ్లాప్ సినిమాల తరువాత 'రన్ రాజా రన్' తో హిట్ అందుకున్నాడు.
undefined
అల్లు అర్జున్ - 'పరుగు' సినిమా హిట్ తరువాత బన్నీకి మూడు ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. 'ఆర్య 2', 'వరుడు', 'బద్రినాథ్' ఏదీ వర్కవుట్ కాలేదు. ఆ తరువాత త్రివిక్రమ్ తీసిన 'జులాయి' తో హిట్ ట్రాక్ లో పడ్డాడు.
undefined
రామ్ చరణ్ - 'నాయక్' సినిమా తరువాత చరణ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. 'ధృవ' సినిమాతో ఓకే అనిపించి 'రంగస్థలం'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
undefined
బెల్లంకొండ శ్రీనివాస్ - 'అల్లుడు శీను' సినిమా తరువాత ఐదు ఫ్లాప్ సినిమాలు చేసిన తరువాత ఫైనల్ గా 'రాక్షసుడు'తో హిట్ అందుకున్నాడు.
undefined
రానా - 'లీడర్' సినిమా తరువాత రానా సోలోగా చేసిన నాలుగు సినిమాలు కమర్షియల్ గా హిట్ అవ్వలేదు. చాలా గ్యాప్ తరువాత 'ఘాజీ'తో హిట్ అందుకున్నాడు.
undefined
click me!