స్టార్ హీరోల ప్రభావంతో ఎదగలేకపోయిన అద్భుతమైన నటులు!

First Published Dec 21, 2019, 10:12 AM IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ఎప్పటికప్పుడు అద్భుతమైన నటులు పుట్టుకొస్తూనే ఉన్నారు. కానీ వారిలో కొందరు మాత్రమే స్టార్ స్టేటస్ ని అనుభవించగలుగుతున్నారు. మంచి ట్యాలెంట్ ఉన్నపటికీ కెరీర్ లో నిలదొక్కుకోలేకపోయిన నటులు వీళ్ళే.  

కాంతారావు: జానపద, పౌరాణిక చిత్రాలతో అద్భుత నటుడిగా కాంతారావు గుర్తింపు సొంతం చేసుకున్నారు. హీరోగా అనేక చిత్రాల్లో కాంతారావు నటించారు. కానీ అదే సమయంలో ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలతో దూసుకుపోవడంతో ఆ ప్రభావం కాంతారావుపై పడింది. ఎన్టీఆర్ ఎఫెక్ట్ వల్ల కాంతారావు అగ్ర నటుడిగా ఎదగలేకపోయారు.
undefined
హరనాథ్: ఎన్టీఆర్ స్టార్ డమ్ ముందు నిలబడలేకపోయిన మరో నటుడు హరనాథ్. రాముడు, కృష్ణుడు లాంటి పాత్రలకు సరిపోయే రూపం ఆయన సొంతం.
undefined
మురళి మోహన్ : మురళి మోహన్ ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్న సమయంలో ఆయనపై సూపర్ స్టార్ కృష్ణ ప్రభావం పండింది. దీనితో  మురళి మోహన్ కొన్ని పాత్రలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది.
undefined
సుమన్ :  చిరంజీవి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే సమయానికి సుమన్ పేరు బాగా మారుమోగుతోంది. క్రమంగా చిరంజీవి తిరుగులేని స్టార్ గా మారడంతో సుమన్ ప్రభావం తగ్గుతూ వచ్చింది. చిరు రాకముందు వరకు సుమన్ నెక్స్ట్ టాలీవుడ్ నెం 1 అని అంతా అనుకున్నారు. మరికొన్ని కారణాలు కూడా సుమన్ కెరీర్ ని దెబ్బతీశాయి.
undefined
భానుచందర్ : భాను చందర్ కూడా మంచి నటుడు. చిరంజీవి ఇమేజ్ భానుచందర్ కెరీర్ ని కూడా దెబ్బతీసింది.
undefined
రమేష్ బాబు: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా రమేష్ బాబు ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలో మంచి విజయాలు ఎదురయ్యాయి. కానీ అదే సమయంలో బాలయ్య ఇమేజ్ పెరగడంతో రమేష్ బాబు ఎక్కువకాలం నిలదొక్కుకోలేకపోయారు.
undefined
నరేష్ : ఓ వైపు చిరు దూసుకుపోతుంటే నరేష్ తనదైన శైలిలో వినోదాత్మక చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరించాడు. కానీ నాగార్జున, వెంకటేష్ ఎంట్రీ ఇవ్వడంతో నరేష్ ప్రభావం తగ్గింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది.
undefined
అబ్బాస్ : అప్పట్లో యువత అబ్బాస్ స్టైల్ అంటే పడి చచ్చేవారు. మంచి ప్రేమ కథా చిత్రాలు చేస్తూ యువతని అబ్బాస్ అలరించాడు. కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ తర్వాత యువత మొత్తం అతడి వైపు మళ్లారు. దీనితో అబ్బాస్ స్టార్ స్టేటస్ ని అందుకోలేకపోయారు.
undefined
వడ్డే నవీన్ : అప్పట్లో యూత్ కి బాగా కనెక్ట్ అయిన హీరో వడ్డే నవీన్. కానీ ఒక జోనర్ చిత్రాలకే పరిమితం కావడం వడ్డే నవీన్ కెరీర్ ని దెబ్బ తీసింది.
undefined
వేణు : రాజేంద్ర ప్రసాద్ తరువాత అంతలా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన హీరో వేణు. వివిధ కారణాల వల్ల వేణు ఎక్కువకాలం హీరోగా కెరీర్ ని కొనసాగించలేకపోయాడు.
undefined
తరుణ్ :ప్రేమ కథా చిత్రాలతో యువతలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న హీరో తరుణ్. ఇక తరుణ్ కి టాలీవుడ్ లో తిరుగులేదు అనుకుంటున్న సమయంలో సడెన్ గా తరుణ్ గ్రాఫ్ పడిపోయింది.
undefined
ఉదయ్ కిరణ్ : ఎమోషనల్ ప్రేమ కథా చిత్రాలతో ఉదయ్ కిరణ్ అటు యువతని ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించాడు. కానీ ఉదయ్ కిరణ్ కెరీర్ సడెన్ గా పడిపోవడానికి అనేక రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ ఆత్మహత్యతో అతడి జీవితం విషాదాంతంగా  ముగిసింది.
undefined
click me!