టాలీవుడ్ హీరోల సిక్స్ ప్యాక్ లుక్స్.. అయినా గ్యారెంటీ లేదు.. వాళ్లకు మాత్రమే!

First Published | Dec 15, 2019, 12:32 PM IST

ఇప్పటివరకు కొంత మంది టాలీవుడ్ హీరోలు సిక్స్ ప్యాక్ లుక్ లో మెరిశారు. కానీ  హీరోలు సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించినంత మాత్రాన సినిమా హిట్ అవుతుందని గ్యారెంటీ లేదు. కేవలం అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి హీరోల చిత్రాలు మాత్రమే సక్సెస్ సాధించాయి. 

అల్లు అర్జున్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దేశముదురు చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ ట్రై చేశాడు. పూరి జగన్నాధ్ దర్శత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
నితిన్ : యంగ్ హీరో నితిన్ విక్టరీ, రెచ్చిపో లాంటి చిత్రాల్లో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించాడు. ఆ రెండు చిత్రాలు డిజాస్టర్స్ గా నిలిచాయి.

ప్రభాస్ : ఆరడుగుల కటౌట్ ప్రభాస్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపిస్తే ఎవరైనా ఫిదా కావలసిందే. బాహుబలి చిత్రంలో ప్రబస్ సిక్స్ ప్యాక్ లుక్ లో మెరిశాడు.
రానా దగ్గుబాటి :మరో ఆరడుగుల ఆజాను బాహుడు రానా కూడా  బాహుబలి చిత్రంలో కండలు తిరిగిన బాడీతో ఆకట్టుకున్నాడు.
ఎన్టీఆర్ : యుంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు చిత్రాల్లో సిక్స్ ప్యాక్ లుక్ లో మెరిశాడు. టెంపర్, అరవింద సమేత చిత్రాల్లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు ఘనవిజయం సాధించాయి.
సునీల్: సునీల్ మిస్టర్ పెళ్లి కొడుకు చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించాడు. సునీల్ సిక్స్ ప్యాక్ లుక్ వల్ల ఆ చిత్రానికి భారీ హైప్ వచ్చింది. కానీ సినిమా నిరాశపరిచింది.
నాగార్జున : కింగ్ నాగార్జున ఐదు పదవుల వయసు దాటినా తర్వాత కూడా సిక్స్ ప్యాక్ లుక్ లో మెరిశాడు. ఢమరుకం చిత్రంలో నాగ్ సిక్స్ ప్యాక్ లో కనిపించాడు.
రాంచరణ్ : పవర్ ఫుల్ పోలీస్ డ్రామా ధృవ చిత్రంలో రాంచరణ్ సిక్స్ ప్యాక్ లుక్ లో మెరిశాడు . ఆ చిత్రం మంచి విజయం సాధించింది.
సుధీర్ బాబు : ఆడు మగాడ్రా బుజ్జి చిత్రంలో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ లుక్ లో నటించాడు.
అబ్జిత్ : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ యంగ్ హీరో అబ్జిత్ కూడా సిక్స్ ప్యాక్ లుక్ ట్రై చేశాడు.
సాయిధరమ్ తేజ్ : మెగా హీరో సాయిధరమ్ తేజ్ అప్ కమింగ్ మూవీ ప్రతి రోజూ పండగే చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నాడు. తేజు సిక్స్ ప్యాక్ స్టిల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Latest Videos

click me!