టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్స్.. వీళ్లు కలిస్తే బాక్స్ ఆఫీస్ బద్దలే..!

First Published Nov 12, 2019, 9:26 AM IST

టాలీవుడ్ లో చాలా వరకు కొన్ని కాంబినేషన్స్ తప్పనిసరిగా సెట్టవ్వల్సిందే. ముఖ్యంగా దర్శకుడు సంగీత దర్శకుడు ఈ రోజుల్లో బెస్ట్ కాంబో గా మారిన ఒక ఆప్షన్. సినిమాకు మ్యూజిక్ పార్ట్ ప్రధాన ఆయుధం. అందుకే చాలా మంది దర్శకులు ఒక్కసారి కనెక్ట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్స్ ని మళ్ళీ వదలరు. అలాంటి వారిపై ఓ లుక్కేద్దాం.. 

కె.రాఘవేంద్ర రావ్ - కీరవాణి: ఈ కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఘరానా మొగుడు - సుందరకాండ సినిమాలకు మంచి మ్యూజిక్ ఇవ్వడంతో మళ్ళీ దర్శకేంద్రుడు కీరవాణినే ఎక్కువగా ఎంచుకున్నాడు. మధ్యలో మణిశర్మ అలాగే కొంత మందితో వర్క్ చేసినప్పటికీ మళ్ళీ కీరవాణితోనే కంటిన్యూ అయ్యారు.
undefined
సుకుమార్ - దేవి శ్రీ ప్రసాద్: ఆర్య సినిమాతో మొదలైన ఈ కాంబో ఒక్కసారి కూడా బ్రేక్ తీసుకోలేదు. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్న కూడా అన్ని మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. భవిష్యత్తులో కూడా ఈ దర్శకుడు దేవిని వదిలేలా లేడు.
undefined
శ్రీను వైట్ల - దేవి శ్రీ ప్రసాద్: ఆనందం, సొంతం , వెంకీ, రెడీ వంటి సినిమాలకు ఈ కాంబో బాగా పనిచేసింది. అప్పట్లో శ్రీను వైట్ల మొదటి ఆప్షన్ గా డీఎస్పీని ఎంచుకునేవారు.ఇతర కమిట్మెంట్స్ వల్ల వేరే సంగీతదర్శకులతో వర్క్ చేసేవారు. ఇక దూకుడు తరువాత థమన్ తో నాలుగు సినిమాలు చేశాడు.
undefined
రెండు భాగాలు వద్దన్నాను..: ఈ విషయమై కీరవాణి మాట్లాడుతూ..ఇంత భారీ ప్రాజెక్టు చేస్తున్నప్పుడు రాజమౌళికి నన్ను వచ్చి కలిసాడు.‘ఒక భాగంగా తీద్దామా? లేక రెండు భాగాలుగా తీద్దామా? అని అడిగినప్పుడు నేను ఒక పార్ట్ గానే తీస్తే బాగుంటుందని సలహా ఇచ్చా. ఎందుకంటే ఇందులో అత్యధికమంది ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ పనిచేయాల్సి ఉంటుందనే ఉద్దేశంతో అలా చెప్పా. అయితే ఆ తర్వాత రెండు భాగాలుగా తీశాం అన్నారు.
undefined
కొరటాల శివ: మిర్చి నుంచి దర్శకుడు కొరటాల దేవినే వాడుతున్నాడు. అయితే నెక్స్ట్ మెగాస్టార్ తో చేయబోయే సినిమాకు వేరే సంగీత దర్శకుడు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
undefined
శేఖర్ కమ్ముల - మిక్కీ జె మేయర్: హ్యాపీ డేస్ - లీడర్ - లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలకు మిక్కీని సెలెక్ట్ చేసుకున్న కమ్ముల ఎవర్ గ్రీన్ సాంగ్స్ ని రాబట్టాడు.
undefined
బి.గోపాల్- మణిశర్మ: ఈ కాంబోలో వచ్చిన ఇంద్ర - నరసింహనాయుడు - సమరసింహా రెడ్డి - అడవి రాముడు వంటి సినిమాలు మ్యూజికల్ హిట్స్ అయ్యాయి.
undefined
త్రివిక్రమ్ - థమన్: ఏమైందో ఏమో గాని మాటల మాంత్రికుడు ఈ మధ్య థమన్ సెట్ చేసుకుంటున్నాడు.  అరవింద సమేత ఆల్బమ్ హిట్టవ్వడంతో అల వైకుంఠమురములో మళ్ళీ సెట్టయిన ఈ కాంబో బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేసేందుకు సిద్ధమైంది.
undefined
త్రివిక్రమ్ - దేవి శ్రీ ప్రసాద్: వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్ చేశాయి. జల్సా - జులాయి - అత్తారింటికి దారేది - సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు బెస్ట్ ఆల్బమ్స్ గా నిలిచాయి.
undefined
సాయి కార్తీక్ - అనిల్ రావిపూడి: మొదటి మూడు సినిమాలు(పటాస్ - సుప్రీమ్ - రాజా ధీ గ్రేట్) సినిమాలకు సాయితో మ్యూజిక్ చేయించుకున్న అనిల్ F2 సినిమాకు దేవిని సెట్ చేసుకున్నాడు. నెక్స్ట్ మహేష్ సినిమాకు కూడా దేవినే!
undefined
శంకర్ - రెహమాన్: అపరిచితుడు - స్నేహితుడు తప్పితే శంకర్ అన్ని సినిమాలకు రెహమాన్ పని చేశాడు. ఆ రెండు సినిమాలకు కూడా రెహమాన్ మ్యూజిక్ అందించాల్సింది. కానీ బిజీగా ఉండడంతో కాంబో సెట్ కాలేకపోయింది.
undefined
click me!