హిట్టు కథలతో బాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయిన తెలుగు దర్శకులు

First Published Dec 30, 2019, 9:22 AM IST

టాలీవుడ్ లో పెద్ద దర్శకులు బాలీవుడ్ కి వెళ్ళడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. గతంలో A స్టార్ దర్శకులకు ఆఫర్స్ గట్టిగానే వచ్చేవి. కానీ అక్కడ పెద్దగా సక్సెస్ అందుకోలేదు. ఈ మధ్య ఇద్దరు ముగ్గురు ఎదో అలా అలా సక్సెస్ లు అందుకుంటున్నారు. ఇక బాలీవుడ్ లో అవకాశం అందుకొని సత్తా చాట లేకపోయిన దర్శకులపై ఒక లుక్కిస్తే..

పూరి జగన్నాథ్: బద్రి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పూరి నెక్స్ట్ అదే సినిమాను బాలీవుడ్ లో షార్ట్: ద ఛాలెంజ్ టైటిల్ తో తుషార్ కపూర్ ని హీరోగా పెట్టి రీమేక్ చేశాడు. అలాగే 2011లో అమితాబ్ బచ్చన్ తో బుడ్డా హోగా తేరా బాప్ అనే సినిమా చేశాడు.కానీ ఆ సినిమా అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు.
undefined
రంగీలా - సత్య సినిమా తరువాత ఒక బాలీవుడ్ ని ఆకర్షించిన తెలుగు టాప్ డైరెక్టర్ గా రామ్ గోపాల్ వర్మ ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ లో 30కి పైగా సినిమాలు చేసిన ఆర్జీవీ 10 బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్నాడు. అయితే ఎక్కువ కాలం ఆయన ఆ బ్రాండ్ ని నిలబెట్టుకోలేకయారు.
undefined
తేజ: తెలుగులో నువ్వు నేను సినిమాతో సక్సెస్ అందుకోగానే అదే కథను బాలీవుడ్ లో యే దిల్ అని రీమేక్ చేశాడు. తుషార్ కపూర్ హీరోగా నటించిన ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
undefined
కృష్ణ వంశీ: అనంతపురం సినిమాతో బాలీవుడ్ ని ఆకర్షించిన కృష్ణవంశీ ఆ సినిమాను శక్తి: ద పవర్ పోరుతో బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. కరిష్మా కపూర్ - సంజయ్ కపూర్ - నానా పటేకర్ వంటి స్టార్స్ నటించిన ఆ సినిమాలో షారుక్ ఖాన్ కూడా స్పెషల్ పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కవ్వలేకపోయింది.
undefined
నువ్వే కావాలి సినిమాతో స్టార్ డైరెక్టర్ గా క్లిక్కయిన దర్శకుడు కె.విజయభాస్కర్ ఆ తరువాత అదే కథను రితేష్ దేశ్ ముఖ్ - జెనీలియా లతో తుజే మేరీ కసమ్ అనే టైటిల్ తో రీమేక్ చేశారు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు.
undefined
100 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన సీనియర్ డైరెక్టర్: కె.రాఘవేంద్ర రావ్ బాలీవుడ్ లో కూడా పలు సినిమాలను తెరకెక్కించారు. మొదట 1980లో జితేంద్రతో వేటగాడు సినిమాను నిషాన గా బాలీవుడ్ లో రీమేక్ చేశారు.
undefined
క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) మంచి సందేశాత్మక చిత్రాలతో బాలీవుడ్ ని సైతం ఆకర్షించాడు. మొదట 2015లో అక్షయ్ కుమార్ తో గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఆ తరువాత కంగనా మణికర్ణిక సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. కానీ మధ్యలో డ్రాప్ అయ్యాడు. బాలీవుడ్ లో ఆఫర్స్ కూడా కరువయ్యాయి.
undefined
కె రాఘవేంద్ర రావ్ తనయుడు ప్రకాష్ కోవెలమూడి ఇటీవల కంగనా తో మెంటల్ హై క్యా అనే సినిమాను డైరెక్ట్ చేసి బాలీవుడ్ సినీ ప్రముఖులను ఆకర్షించాడు. తెలుగులో అనగనగ ఒక ధీరుడు - సైజ్ జీరో వంటి సినిమాలు చేసిన ప్రకాష్ మొదటి సక్సెస్ మాత్రం బాలీవుడ్ లోనే దక్కింది. కానీ మరో అవకాశాన్ని అందుకోవడంలో ఈ డైరెక్టర్ సక్సెస్ కాలేకపోతున్నారు.
undefined
సందీప్ వంగా: అర్జున్ రెడ్డి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకొని మళ్ళీ అదే రేంజ్ లో బాలీవుడ్ లో కూడా కబీర్ సింగ్ గా అర్జున్ రెడ్డి కథను రీమేక్ చేసిన సందీప్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే టీమ్ తో మరో సినిమా చేయబోతున్నాడు. సందీప్ అయినా బాలీవుడ్ రెగ్యులర్ డైరెక్టర్స్ లా కొనసాగుతాడో లేదో చూడాలి.
undefined
జెర్సీ సినిమాని రీమేక్ చేయడానికి మరో తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా బాలీవుడ్ లో తన లక్కుని పరీక్షించుకోబోతున్నాడు. ఇతను ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.
undefined
click me!