టాలీవుడ్ వివాదం: జంతువులు ఎన్నున్నా సింహమే కింగ్.. పూరి ట్వీట్ బాలయ్యని ఉద్దేశించేనా ?

First Published May 31, 2020, 10:19 AM IST

ఎలాంటి చిన్న ఇష్యూ వచ్చినా టాలీవుడ్ లో ఇట్టే ఆధిపత్య పోరు తెరపైకి వచ్చేస్తూ ఉంటుంది. ఫ్యాన్ బేస్ పరంగా, వర్గాల పరంగా టాలీవుడ్ లో గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం.

ఎలాంటి చిన్న ఇష్యూ వచ్చినా టాలీవుడ్ లో ఇట్టే ఆధిపత్య పోరు తెరపైకి వచ్చేస్తూ ఉంటుంది. ఫ్యాన్ బేస్ పరంగా, వర్గాల పరంగా టాలీవుడ్ లో గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం. కరోనా లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్, ఇతర కార్యక్రమాలన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
undefined
రెండు నెలలుగాచిత్ర పరిశ్రమకు చెందిన ఎలాంటి కార్యకలాపాలు సాగడం లేదు. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగిస్తున్నప్పటికీ కొన్ని మినహాయింపులని ప్రభుత్వం ఇస్తోంది. దీనితో చిత్ర పరిశ్రమలో షూటింగ్స్, సినిమా రిలీజ్ లు జరిగే విధంగా అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నివాసంలోమంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్ తో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం అయ్యారు.
undefined
అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలసి విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమానికి తనని ఎవరూ ఆహ్వానించలేదని.. పైగా వీళ్లంతాభూములు పంచుకునేందుకు సమావేశం అయ్యారాఅంటూ బాలయ్య చేసిన కామెంట్స్టాలీవుడ్ లో కాక రేపాయి.
undefined
బాలయ్యకు కౌంటర్ ఇచ్చే విధంగా నాగబాబు, తమ్మారెడ్డి లాంటి ప్రముఖులు వ్యాఖ్యలు చేశారు. దీనితో ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద వివాదమే సాగుతోంది. కొంతమంది బాలయ్యకు సపోర్ట్ గా, మరికొంతమంది చిరంజీవికిసపోర్ట్ గా చీలిపోయారు.
undefined
తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చేసిన ట్వీట్ పరోక్షంగాఉంటూ సరికొత్త వివాదానికి తెరలేపింది. పూరి జగన్నాధ్ ట్వీట్ తో బాలయ్య అభిమానులు మాత్రం హ్యాపీగా ఉన్నారు. ఇంతకీ పూరి చేసిన ట్వీట్ ఏంటంటే.. అడవిలో ఉన్న ఇతర జంతువులకు.. సింహానికి ఉన్న తేడాని పూరి ఓ వీడియో రూపంలో వివరించాడు.
undefined
నేను విన్నదాని ప్రకారం అడవిలో ఏనుగు అత్యంత పెద్ద జంతువు, జిరాఫీ పొడవైన జంతువు, నక్క తెలివైనది, చిరుత వేగవంతమైనది.. ఇవన్నీ అద్భుతమైన లక్షణాలు.. అయినప్పటికీ నేను విన్నది అడవికి రాజు సింహం మాత్రమే.. ఎందుకో తెలుసా.. సింహానికి అన్నింటికీ మించిన అద్భుతమైన లక్షణం ఒకటి ఉంది.. అదే ధైర్యం.. సింహం ఎట్టిపరిస్థితుల్లో ధైర్యం కోల్పోదు. అందుకే సింహమే కింగ్ అని పూరి ట్వీట్ చేశాడు.
undefined
ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. బాలయ్యని అభిమానులంతా సింహంతో పోల్చుతుంటారు. పూరి కూడా బాలయ్యని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారనిఅభిమానుల్లో చర్చ జరుగుతోంది.
undefined
click me!