బాలీవుడ్ అందాల భామ పూజా బేడీ వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన అందాల భామ అలయ. లెజెండరీ యాక్టర్ కబీర్ బేడీ మనవరాలిగా ఈ ఏడాది జవానీ జానేమన్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ తో కలిసి నటించింది అలయ. ఈ సినిమాలో 40 ఏళ్ల వ్యక్తిని తన తండ్రిగా ప్రూవ్ చేసుకునే పాత్రలో నటించింది అలయ. ఈ సినఇమా తరువాత జాకీ భగ్నానితో మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పిన అలయ, మరో మూడు సినిమాలకు సంబంధించి చర్చలు జరుపుతోంది. సినిమాల సంగతి అటుంచితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది అలయ. హాట్ ఫోటోలతో అలరిస్తోంది అలయ.