'RDX లవ్' మూవీ రివ్యూ!

First Published Oct 11, 2019, 2:16 PM IST

సినిమాలందు చిన్న సినిమాలు వేరయా ...ఆ చిన్న సినిమాలకు హాట్ కంటెంటే కావాలయా అని హమ్ చేసే వాళ్లు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.  అయితే ఆన్లైనే బోల్డంత బోల్డు కంటెంట్ దొరుకుతూంటే పనిగట్టుకుని సినిమాకు ఆ సీన్స్ కోసం వెళ్లేవాళ్లు ఉంటారా అని ప్రశ్నించే వాళ్లూ ఉంటారు. 

(Review By___ సూర్యప్రకాష్ జోస్యుల) సినిమాలందు చిన్న సినిమాలు వేరయా ...ఆ చిన్న సినిమాలకు హాట్ కంటెంటే కావాలయా అని హమ్ చేసే వాళ్లు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అయితే ఆన్లైనే బోల్డంత బోల్డు కంటెంట్ దొరుకుతూంటే పనిగట్టుకుని సినిమాకు ఆ సీన్స్ కోసం వెళ్లేవాళ్లు ఉంటారా అని ప్రశ్నించే వాళ్లూ ఉంటారు. అయితే ఏ నిర్మాతల నమ్మకాలు వాళ్లవే. అయితే ఈ మధ్యన అలాంటి సినిమాల హడావిడి తగ్గింది. కానీ ఆర్ ఎక్స్ 100 సినిమా వచ్చాక...మళ్లీ ఆ మూడ్ మార్కెట్ లో కి ప్రవేసించింది. ఆ సినిమా ఎందుకు ఆడినా..హాట్ కంటెంట్ వల్లే ఆడిందని తాము నమ్మి , నిర్మాతను నమ్మించి సినిమాలు చేస్తున్నారు. అలాంటి సినీ రాజాల్లో ఇదొకటి. ఆర్ ఎక్స్ 100 భామనే తీసుకువచ్చి, అందుకు తగినట్లు ప్రమోషన్ చేయటంతో కొంతవరకూ కలిసివచ్చింది. అది ఎంతవరకూ అనేది చూడాల్సి ఉంది. ఈ సినిమాలో ఉండే కథ ఏమిటి... పాయిల్ చేసిన పాత్ర వెనక అసలు విషయం ఏమిటి...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
undefined
కథేంటి: డేరింగ్ , డేషింగ్ అలివేలు (పాయిల్ రాజ్ పుత్ ) చంద్రన్న పేటలో సేఫ్ సెక్స్, హెఐవీ సేప్టీ, ప్రెగ్నెన్సి, పాపులేషన్ కంట్రోలు వంటి వాటిపై అహగాహన కోసం ప్రచారం చేస్తూంటుంది. ఆమె ఆ ఊరి కుర్రాడు సిద్దూ (తేజూస్ కంచెర్ల) తోప్రేమలో పడుతుంది. ఆమె ఇలా సమాజ సేవ చేస్తూ ముఖ్యమంత్రి దృష్టిలో పడి తమ ఊరి వారు ఎదుర్కొంటున్న ఓ ప్రధానమైన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనుకుంటుంది. అందుకు సిద్దూ సైతం సహాయం చేస్తాడు. అయితే ఈ లోగా ఓ పెద్ద టీవీ ఛానెల్ అధినేత గిరిప్ర‌కాష్‌(ఆదిత్య మీన‌న్‌) ఆమెకు అడ్డు పడాతుడు..ఆమెను చంపాలనే ప్రయత్నం చేస్తాడు. మరో ప్రక్క పోలీస్ లు ఆమెకు వార్నింగ్ ఇస్తారు. ఇంతకీ ఈ అలివేలు ఎవరు..ఆమె భుజాన వేసుకున్న ఆ సమస్య ఏమిటి..ముఖ్యమంత్రిని ఆమె కలవగలిగిందా.. ఆమె అసలు లక్ష్యం ఏమిటి, గిరిప్ర‌కాష్‌ కు ఆమెకు ఉన్న వైరం ఏమిటి...ఆమె లవ్ స్టోరీ ఏమైంది, ఆర్ డి ఎక్స్ అనే టైటిల్ అర్దమేమిటి అనే విషయాలుతెలియాలంటే... సినిమా చూడాల్సిందే.
undefined
టైటిల్ కు కథకు లింకేంటి : వాస్తవానికి ఈ టైటిల్ కు కథకు కొంచెం కూడా సంభంధం లేదు. పాయిల్ గత చిత్రం ఆర్ ఎక్స్ 100 పెట్టారు కాబట్టి ఈ సినిమాకు ఆర్ డిఎక్స్ అని టెటిల్ పెట్టారంతే. కండోమ్ ప్యాకెట్స్ పంచుతూ హీరోయన్ ని ప‌రిచ‌యం చేయ‌డం ద‌గ్గ‌రి నుంచి, హీరోని వాడుకుంటూ విల‌న్‌ని బుద్ధి చెప్పే స‌న్నివేశం వ‌ర‌కూ అన్ని వింతగా సాగుతాయి.
undefined
ఈ సీన్లు ఏంటి సామీ : హీరోయిన్ ఉన్న ఊళ్లో జనాలకు పిల్లలు లేక ఇబ్బందులు పడుతూంటే...ఆ ఊళ్లో మొగాళ్లను లైన్లో పెట్టడానికి ఆడోళ్లకు మల్లెపూలు పంచుతుంది హీరోయిన్. పనిలో పనిగా వాత్సాయిన కామసూత్రాలు చెప్తుంది. అక్కడ నుంచి బెడ్ రూమ్ లో మరీ హాట్ సీన్స్. ఆ తర్వాత ఊరంతా మామిడికాయలు కొరకటం..ఇలా డైరక్టర్ చాలా అరాచకం ప్రదర్శిస్తాడు.
undefined
క్లైమాక్స్ దాకా కథ ప్రారంభం కాదు : అప్పట్లో ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రలో మంగతాయారు టిఫెన్ సెంటర్ అనే సినిమా వచ్చింది. మంగతాయారు అనే ఆమె ఓ పల్లెటూరు వచ్చి హోటలు పెట్టడం...అక్కడ కొన్ని సమస్యలు పరిష్కరించటం..ఆ తర్వాత ఆమె కి సమరసింహారెడ్డి టైప్ ప్లాష్ బ్యాక్ ఉందని తేలటం వంటి ఎలిమెంట్స్ తో ఆ సినిమా నడుస్తుంది. కొంచెం అటూ ఇటూలో ఈ స్క్రీన్ ప్లే కూడా ఇలాగే నడుస్తుంది. కొన్ని విషయాలు కథలో దాచిపెట్టి హీరోయిన్ పాత్రను చిత్రంగా నడిపించి, ఆమెపై క్యూరియాసిటీ కలగ చేసి ..ఆ తర్వాత ప్లాష్ బ్యాక్ తో అసలు విషయం రివీల్ చేస్తాడు.
undefined
అయితే ఇక్కడ చివరి ఇరవై నిముషాలు తప్ప అసలు ఆమె ఎవరు..ఎందుకు ఆ ఊరు వచ్చి సంఘ సేవా కార్యక్రమాలు చేస్తోంది వంటి వివరాలు రివీల్ కావు. అలాగే విలన్ పాత్ర కూడా ఎస్టాబ్లిష్ కాదు. దాంతో అసలు సినిమా కథ మొత్తం ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లోనే జరిగినట్లైంది. అంతకు వచ్చే సీన్స్ అన్ని కేవలం ఆ పాత్ర సెటప్ కే వాడటంతో సినిమా బోర్ కొట్టేస్తుంది.
undefined
ఏం చెప్పాలనో... : ఇక ఈ సినిమా ద్వారా డైరక్టర్ ఏమి చెప్పాలనుకుంటున్నారో అర్దం కాదు. ఓ ప్రక్క కండోమ్ లేకుండా శృంగారం చేయ‌డం, గుట్కాలు వాడ‌కం, మ‌ద్య‌పానాన్ని మానిపించ‌డం, ఇలా చాలా విష‌యాల‌ు ఈ సినిమాలో చెప్పేయలనే ప్రయత్నం జరుగుతుంది. మరో ప్రక్క ఈ మెసేజ్ ఓపియెంటెడ్ సినిమాలో హాట్ సీన్స్ వస్తూంటాయి. దాంతో అటూ ఇటూ కాని పరిస్దితి ఏర్పడింది. సినిమాలో ఎక్కువ భాగం రొమాంటిక్ సీన్స్ , వల్గర్ డైలాగులతో నింపే ప్రయత్నం చేసాడు. కాబట్టి ఫ్యామిలీలు ఎలాగో ఇటు చూడరు. అలాగని యూత్ కు ఎట్రాక్షన్ ఉందా...సినిమా లో విషయం లేకుండా వచ్చే హాట్ సీన్స్ ఎంత సేపని భరించగలరు.
undefined
టెక్నికల్ గా.. : రాధన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అయితే పాట‌లు బాగోలేదు. కెమెరా వ‌ర్క్ అద్బుతం కాదు కానీ ఓకే. కొన్ని సన్నివేశాలు, పాటలు చుట్టేసినట్లు అర్దమైపోతుంది. సినిమా లో ఎక్కువగా కండోమ్, హెచ్ ఐ వీ లాంటి ప‌దాలే వినిపిస్తాయి....ఇంక వాటిమధ్య డైలాగులు వెతుక్కోవాలి.
undefined
బాగున్న సీన్ : సినిమాలో చెప్పుకోదగ్గ సీన్ ఏదైనా ఉంది అంటే..అది విలన్స్ తో హీరోయిన్ క్లైమాక్స్ లో కబడ్డి ఆడటమే.
undefined
ఫైనల్ థాట్ : హీరోయిన్ ని ఒప్పంచినంత ఈజీగా ఈ కథతో ప్రేక్షకులను ఒప్పించం కష్టమే.
undefined
Rating : 25
undefined
click me!