ఎక్కడి నుంచో వచ్చారు.. పవన్, బాలయ్య, మహేష్ కొంప ముంచిపోయారు!

First Published Jan 26, 2020, 12:31 PM IST

ఇతర భాష దర్శకులు తెలుగులో సినిమాలు తీయడం చాలా కాలంగా జరుగుతోంది. కొన్ని సంధర్భాల్లో తమిళ, హిందీ, ఇతర భాషల నుంచి వచ్చి తెలుగులో సినిమాలు చేసిన దర్శకులు సక్సెస్ అయ్యారు. అదే సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోలకు ఇతర భాషా దర్శకుల నుంచి డిజాస్టర్ చిత్రాలు ఎదురయ్యాయి. 

మురుగదాస్: ఏఆర్ మురుగదాస్ స్వతహాగా తమిళ దర్శకుడు. ఆయన ప్రతిభతో సౌత్ మొత్తం క్రేజ్ సొంతం చేసుకున్నారు. స్టాలిన్ తర్వాత మురుగదాస్ నుంచి తెలుగు ప్రేక్షకులంతా మరో స్టైట్ మూవీ కోసం ఎదురుచూశారు. అలాంటి తరుణంలో మురుగదాస్, మహేష్ హ్యాట్రిక్ కాంబోలో వచ్చిన చిత్రం స్పైడర్. ఈ చిత్రం దారుణంగా నిరాశపరిచింది.
undefined
విష్ణు వర్ధన్ : ఈ దర్శకుడు కూడా తమిళుడే. తమిళంలో బిల్లా లాంటి స్టైలిష్ చిత్రాన్ని తెరకెక్కించడంతో తెలుగులో పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. పవన్ తో విష్ణు వర్ధన్ తెరకెక్కించిన పంజా చిత్రం ఫ్యాన్స్ కు నిరాశనే మిగిల్చింది.
undefined
ఎస్ జె సూర్య : ఎస్ జె సూర్య పేరు చెప్పగానే ఖుషి చిత్రం గుర్తుకు వస్తుంది. ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ తో సూర్య చేసిన మరో చిత్రం పులి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
undefined
ఆనంద్ శంకర్: తమిళ దర్శకుడైన ఆనంద్ శంకర్ తెలుగులో చేసిన చిత్రం నోటా. విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో హీరో. విజయ్ దేవరకొండ మంచి జోరు మీద ఉన్న సమయంలో విడుదలైన నోటా ఫ్లాప్ గా నిలిచింది.
undefined
తిరు : మాస్ హీరో గోపీచంద్ చివరగా నటించిన చిత్రం చాణక్య. తమిళ దర్శకుడు తిరు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గోపీచంద్ కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది.
undefined
అపూర్వ లఖియా : రామ్ చరణ్ కెరీర్ లో జంజీర్ చిత్రం ఓ చేదు అనుభవం. బాలీవుడ్ లో అడుగుపెట్టాలని చరణ్ చేసిన ప్రయత్నాలు పూర్తిగా బెడిసికొట్టాయి. బాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లఖియా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
undefined
ఖతర్నాక్ : తమిళ దర్శకుడు అమ్మ రాజశేఖర్, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఖతర్నాక్ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.
undefined
కెఎస్ రవికుమార్ : కేఎస్ రవికుమార్, బాలయ్య కాంబోలో రీసెంట్ గా వచ్చిన రూలర్ చిత్రం దారుణంగా నిరాశపరిచింది.
undefined
ఎం. శరవణన్ : రెడీ, మస్కా లాంటి సూపర్ హిట్స్ తో కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో హీరో రామ్ తమిళ దర్శకుడు శరవణన్ ని నమ్మి దెబ్బై పోయాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన గణేష్ చిత్రం నిరాశపరిచింది.
undefined
శంఖం : తమిళంలో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న శివ దర్శకత్వంలో గోపీచంద్ శౌర్యం, శంఖం లాంటి చిత్రాల్లో నటించాడు. శౌర్యం మూవీ పరవాలేదనిపించింది.కానీ శంఖం నిరాశపరిచింది.
undefined
click me!