అమ్మాయి నచ్చాలే కానీ ఆమె కోసం ఎంత దూరమైన వెళ్తారు కుర్రకారు. అలాంటి కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండ్. నచ్చిన అమ్మాయి కోసం ఎంతదూరం వెళ్ళాడు? ఏం చేశాడు? అన్నదే ఈ కథ. సౌజన్య ఆర్. అట్లూరి సమర్పణలో శ్రీరామ్ మూవీస్ పతాకంపై ఉదయ్ శంకర్,జెన్నీఫర్, మధు నందన్, శ్రీకాంత్ అయ్యాంగార్ నటీ నటులు గా గురు పవన్ దర్శకత్వంలో అట్లూరి నారాయణ రావు నిర్మించిన ఈ చిత్రం ఈరోజు(నవంబర్ 11) రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఎంత వరకూ ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.
ముందుగా కథ విషయానికి వస్తే.. హీరో రాజారాం బీకాం చదివిన నిరుద్యోగి. అతను స్టాక్ మార్కెట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. ఈక్రమంలోనే హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న సంధ్య అలియాస్ శాండీ ని చూడగానే తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కాని ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంటుంది. సంధ్యను ప్రేమించిన ప్రతీ ఒక్కరూ చనిపోతుంటారు. ఈ క్రమంలో హీరో ప్రేమను ఆమె తిరస్కరిస్తుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది. దానికి కారణం ఏంటీ..? ఇంతకీ మన రాజారాం లవ్ ఏమైంది. శాండీ ప్రేమను అతను గెలుచుకున్నాడా..? అసలు ఈ మరణాల వెనుక ఉన్న రహస్యం ఏంటీ అనేది సినిమాలో చూసి తెలసుకోవల్సిందే.
విశ్లేషణః
లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌లో నడిచే సందేశాత్మక చిత్రమిది. సెన్సెన్స్ మోసాలను ఆవిస్కరించిన చిత్రమిది. దర్శకుడు గురుపవన్ ఓ కొత్త పాయింట్‌ని ఎంచుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఎక్కడో ఇతర దేశాల్లో యుద్ధం జరిగితే మన సెన్సెన్స్ కూలిపోవడమేంటి? మనం నష్టపోవడమేంటి? దాని వెనకాల కార్పొరేట్లు చేసే కుట్రలను కళ్లకు కట్టినట్టు చూపించారు. ఓవైపు ప్రేమ కథ నడుస్తూనే, దానికి స్టాక్ మార్కెట్లలోని మోసాలకు లింక్ పెడుతూ తెరకెక్కించిన తీరుకి అభినందించాల్సిందే. ఇక సినిమా పరంగా మొదటి భాగం సరదా సరదాగా జరుగుతుంది. ఇంటర్వెల్ వరకు ఒక్క రోజులో జరిగిన సంఘటనే కనిపిస్తుంది. నచ్చిన అమ్మాయిని పడేయడంకోసం హీరో చేసే ప్రయత్నాలు బాగున్నాయి. అయితే అ సన్నివేశాలు కాస్త స్లోగ రన్ అవడంతో కొంత బోర్ ఫీలింగ్‌ని కలిగిస్తుంది. కొన్ని సీన్లలో సహజత్వం మిస్ అయ్యింది. ప్రారంభం నుంచే ఓ సస్పెన్స్ అంశం సినిమాలో వెంటాడుతూనే ఉంటాయి. హీరోయిన్‌ని కలిసి ఒక్కొక్కరు చనిపోవడం ఉత్కంఠని గురి చేస్తుంది. సెకండాఫ్ వచ్చాక సినిమా పరుగులు పెడుతుంది. గ్రిప్పింగ్‌గా తీసుకెళ్లారు. సెకండాఫ్‌లో కొన్ని సర్‌ప్రైజ్‌లు, కాస్త థ్రిల్లింగ్ అంశాలు, మంచి సందేశం ఫర్వాలేదనిపించేలా ఉంటాయి. ఓవరాల్‌గా ఇదొక మెసేజ్ ఓరియెంటెడ్ లవ్ స్టోరీగా చెప్పొచ్చు.
చిన్న సినిమా అయినా మంచి ప్రయత్నం చేశారు టీమ్. ఈ సినిమాలో హీరో ఉదయ్ శంకర్, హీరోయిన్ జెన్నీఫర్ ఇద్దరు చక్కగా నటించారు. కొత్తవారే అయినా.. మంచి ప్రయత్నం చేశారు. హీరోగా టాలీవుడ్ లో నిలబడే ప్రయత్నంలో ఉన్న ఉదయ్ శంకర్ కు ఇది మంచి ఇక వీరితో పాటు తో పాటు చెంగల్రావు పాత్రలో మధునందన్ కృష్ణ పాండే పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్.., పేటీఎం ప్రసాద్ క్యారెక్టర్ లో సీనియర్ కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ నటించగా.. సీనియర్ నటుడు సుమర్ ముఖేష్ గౌరవ్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఈ మూవీలో ప్రతీ నటుడు తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు.
ఇక టెక్నీకల్ టీమ్ విషయానికి వస్తే.. ఒక రోజులో వైజాగ్ నుంచి భీమిలి సాగే రోడ్ జర్నీ పాయింట్‌ను దర్శకుడు గురుపవన్ కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ప్రేమ కథకు థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను యాడ్ చేసి.. సస్పెన్స్ ను క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ మూవీ కథను ఆకట్టుకొనేలా నడిపించడంలో కాస్త తడబడినా.. తమ పరిధి మేరకు మంచి అపుట్ పుట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో బోరుకొట్టించినా.. సెకండ్ హాఫ్ మాత్రం మలుపులతో ఇంట్రెస్టింగ్ గా సాగిపోయింది సినిమా. . యాక్షన్ సీన్లు, రొమాన్స్ అంశాలను చక్కగా దర్శకుడు డీల్ చేశారు.
సిద్దం మనోహార్ సినిమాటోగ్రఫి సినిమాకు ప్లస్ అయింది. షూటింగ్ అంతా దాదాపు ఆంధ్రాలోనే జరిగింది. ఈ క్రమంలో వైజాగ్ అందాలను అద్భుతంగా కెమెరాలో బంధించాడు. యాక్షన్ సీన్లను బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే.. గిఫ్టన్ మ్యూజిక్ పర్ఫెక్ట్‌గా ఇచ్చాడు సినిమాకు కావల్సిన సస్సెన్స్ థ్రిల్లర్ బీజీఎంను అందించాడు. పాటలకు తగ్గట్టు మ్యూజిక్ ఇచ్చాడు గిఫ్టన్. ఉడగండ్ల సాగర్ ఎడిటింగ్ బాగుంది. ప్రోడక్షన్ వాల్యూస్ పర్వాలేదు.
ఇక ఓవర్ ఆల్ గా ఈసినిమా గురించి చూస్తే.. సస్పెన్స్ థ్రిల్లర్స్ ను ఇష్టపడేవారు ఈ సినిమాను చూడవచ్చు. కాని రెండు మూడు సార్లు వెళ్లి చూడదగిన సినిమా కాకపోయినా.. సినిమాలో మలుపులు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. టోటల్ గా ఒక్క సారి వెల్ళి చూడవచ్చు.
సినిమా: నచ్చింది గర్ల్ ఫ్రెండ్
రిలీజ్ డేట్: 2022-11-11
నటీనటులు: ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్, సుమన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్
దర్శకత్వం : గురు పవన్
నిర్మాత : అట్లూరి నారాయణ రావు
సినిమాటోగ్రఫి : సిద్దం మనోహార్
మ్యూజిక్: గిఫ్టన్,
ఎడిటర్: ఉడగండ్ల సాగర్
నచ్చింది గర్ల్ ఫ్రెండూ రివ్యూ, ఉదయ్ శంకర్, రివ్యూ, నచ్చింది గర్ల్ ఫ్రెండూ మూవీ రివ్యూ