టోటల్ సినిమానే ఏకిపారేసిన ట్రోలర్స్.. తలలు పట్టుకున్న హీరోలు!

First Published Dec 7, 2019, 11:02 AM IST

తమ అభిమాన హీరో సినిమా ఇన్ని రోజులు ఆడిందని, ఇన్ని రికార్డులు క్రియేట్ చేసిందని చెప్పుకుంటూ మురిసిపోతుంటారు ఫ్యాన్స్. 

తమ అభిమాన హీరో సినిమా ఇన్ని రోజులు ఆడిందని, ఇన్ని రికార్డులు క్రియేట్ చేసిందని చెప్పుకుంటూ మురిసిపోతుంటారు ఫ్యాన్స్. ఈ విషయం పక్కన పెడితే ప్రతీ ఫేవరేట్ హీరోకి ఒక అధ్బుతమైన, ఆణిముత్యం లాంటి డిజాస్టర్ పడే ఉంటుంది. ఆ డిజాస్టర్ సినిమాలను ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేశారు. అలా టాలీవుడ్ లో ట్రోలింగ్ కి గురైన హీరోల సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!
undefined
మహేష్ బాబు - ఈ సూపర్ స్టార్ నటించిన 'బ్రహ్మోత్సవం' సినిమాని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో మర్చిపోలేం. సినిమా ఫస్ట్ డే రిలీజైన తరువాత థియేటర్ దగ్గర ఫ్యాన్స్ కూడా లేరంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అలానే 'స్పైడర్' సినిమాని బాగా ట్రోల్ చేశారు.
undefined
రామ్ చరణ్ - తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా 'వినయ విధేయ రామ' సినిమా వలన దారుణమైన ట్రోలింగ్ కి గురయ్యాడు చరణ్. సినిమాలో ఫైట్స్, ట్రైన్ సీన్, గద్ద సీన్ ఇలా ప్రతీ విషయాన్ని ట్రోల్ చేశారు.
undefined
ఎన్టీఆర్ - ఈ హీరో నటించిన 'శక్తి' సినిమాని ఫ్యాన్స్ కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. తారక్ స్వయంగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ప్రెస్ మీట్ లో 'శక్తి' సినిమాపై కామెంట్స్ చేశారు.
undefined
నాగార్జున - 'శివ', 'గోవింద గోవింద' సినిమాల తరువాత రామ్ గోపాల్ వర్మ నాగార్జునతో తీసిన సినిమా 'ఆఫీసర్'. రిలీజ్ కి ముందు హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ తరువాత దారుణంగా ట్రోలింగ్ కి గురైంది.
undefined
బాలకృష్ణ - బాలయ్య కెరీర్ లో ట్రోల్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో మొదటి స్థానంలో ఉంటుంది 'పరమ వీర చక్ర'. రీసెంట్ గా తీసిన 'ఎన్టీఆర్' బయోపిక్ ని కూడా ట్రోల్ చేశారు.
undefined
వెంకటేష్ - 'షాడో' 2013లో వచ్చిన చెత్త సినిమా ఏదైనా ఉందంటే అది ఇదే.. వీక్ స్క్రిప్ట్ ఎన్నుకున్నందుకు వెంకీ ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేశారు.
undefined
రవితేజ - అసలే ఫ్లాపుల్లో కూరుకుపోయిన రవితేజకి 'అమర్ అక్బర్ ఆంటోనీ' రూపంలో మరో షాక్ తగిలింది. రిలీజ్ తరువాత ఈ సినిమాని, దర్శకుడు శ్రీనువైట్లని బాగా ట్రోల్ చేశారు.
undefined
వరుణ్ తేజ్ - అప్పటివరకు వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ సక్సెస్ లు అందుకున్న వరుణ్ తేజ 'మిస్టర్' లాంటి కథ ఒప్పుకొని తప్పుచేశారు. ఈ సినిమాలో సన్నివేశాలను దారుణంగా ట్రోల్ చేశారు.
undefined
అల్లు అర్జున్ - బన్నీ నటించిన 'బద్రినాథ్', 'వరుడు' సినిమాలో కొన్ని సన్నివేశాలను ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు.
undefined
నితిన్ - 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలో నితిన్ నటించి షాక్ ఇచ్చాడు. అసలు ఆ కథేంటో, వెడ్డింగ్ కాన్సెప్ట్ ఏంటో ఇప్పటికీ అర్ధం కాదు. రీసెంట్ గా ఈ సినిమాను బాగా ట్రోల్ చేశారు.
undefined
ప్రభాస్ - తన కెరీర్ లో ప్రభాస్ రిగ్రెట్ అయ్యే సినిమా ఏదైనా ఉందంటే అది 'రెబల్' అనే చెప్పాలి. సినిమా స్టోరీ, ఫైట్స్, డైలాగ్స్ ఇలా ప్రతీ అంశాన్ని ట్రోల్ చేశారు.
undefined
పవన్ కళ్యాణ్ - 'సర్దార్ గబ్బర్ సింగ్', 'అజ్ఞాతవాసి' రెండు సినిమాలను ఎంత దారుణంగా ట్రోల్ చేశారో చెప్పనక్కర్లేదు.
undefined
నాగచైతన్య - 'దడ' అంటూ వచ్చి ప్రేక్షకుల్లో దడ పుట్టించాడు చైతు. తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమా ఇదే.
undefined
రానా దగ్గుబాటి - 'నేను నా రాక్షసి'
undefined
అక్కినేని అఖిల్ - 'అఖిల్'
undefined
విజయ్ దేవరకొండ - 'నోటా'
undefined
గోపీచంద్ - 'ఆక్సిజన్', 'సౌఖ్యం'
undefined
click me!