గ్రౌండ్ లోనే కాదు.. సిల్వర్ స్క్రీన్ పై కూడా సిక్స్ లే..!

First Published Oct 15, 2019, 3:14 PM IST

ఇండియన్ క్రికెటర్లు చాలా మంది సినిమాల్లో కూడా కనిపించారు. కొందరు ఇష్టంతో సినిమాల్లో నటిస్తే.. మరికొందరు సరదా కోసం నటించేవారు. 

ఇండియన్ క్రికెటర్లు చాలా మంది సినిమాల్లో కూడా కనిపించారు. కొందరు ఇష్టంతో సినిమాల్లో నటిస్తే.. మరికొందరు సరదా కోసం నటించేవారు. కొందరు రిటైర్ అయిన క్రికెటర్లు సినిమాలను తమ కెరీర్ గా మార్చుకున్న వారు కూడా ఉన్నారు. అలా మన క్రికెటర్లు కనిపించిన సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!
undefined
కపిల్ దేవ్ - లెజండరీ ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న తరువాత 'ఇక్బాల్', 'ముజ్సే షాదీ కరోగే' వంటి బాలీవుడ్ చిత్రాలలో తలుక్కున మెరిశారు.
undefined
సునీల్ గవాక్సర్ - సిక్స్ ల సిక్స్ లు కొట్టడం గవాస్కర్ స్టైల్. అతడి దూకుడిని ప్రత్యర్ధులు తట్టుకోలేకపోయేవారు. క్రికెట్ ఫీల్డ్ లో గవాస్కర్ ఒక స్టార్. ఈ మాజీ క్రికెటర్ మరాఠీలో 'సావ్లి ప్రేమచి' అనే సినిమాలో నటించాడు. అలానే 1988లో వచ్చిన 'మాలామాల్' అనే సినిమాలో నటించారు.
undefined
అజయ్ జడేజా - 1990లలో జడేజాకి మంచి క్రికెటర్ గా పేరుండేది. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడడంతో తన కెరీర్ కి ఫుల్ స్టాప్ పడింది. దీంతో అతడు సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. 2003లో 'ఖేల్' అనే బాలీవుడ్ సినిమాలో నటించాడు. కానీ ఈ సినిమా ఫెయిల్ అవ్వడంతో క్రికెటర్ కమెంటర్ గా టర్న్ తీసుకున్నాడు.
undefined
యోగ్ రాజ్ సింగ్ - యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ క్రికెటర్ గా దేశం కోసం ఒక టెస్ట్ మ్యాచ్, ఆరు వన్డేలు ఆడారు. దాదాపు ముప్పై పంజాబీ చిత్రాల్లో నటించారాయన. 'భాగ్ మిల్కా భాగ్' సినిమాలో కోచ్ మిల్కా సింగ్ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
undefined
యువరాజ్ సింగ్ - క్రికెటర్ గా తన కెరీర్ మొదలుకాక ముందు యువరాజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని పంజాబీ చిత్రాల్లో నటించాడు.
undefined
సలీల్ అంకోలా - క్రికెట్ లో తన సత్తా చాటలేకపోయిన సలీల్ ఇండియన్ టెలివిజన్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టీవీ సీరియల్స్ తో పాటు పలు చిత్రాల్లో నటించాడు.
undefined
బ్రెట్ లీ - మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ బ్రెట్ లీ ఇండో-ఆస్ట్రేలియన్ ఫిలిం 'అన్ ఇండియన్' అనే సినిమాలో నటించాడు. అనుపమ్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తనిష్ట చటర్జీ, సుప్రియా పతాక్, ఆకాష్ ఖురానా వంటి తారలు నటించారు.
undefined
సలీం దుర్రాన్ని - ఆఫ్ఘనిస్తాన్ పుట్టిన ఈ క్రికెటర్ లెఫ్ట్ హ్యాండెడ్ ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1973లో ఇంతడు ప్రవీణ్ బాబీతో కలిసి 'ఇషారాస్ చరిత్ర' అనే సినిమాలో నటించాడు. కానీ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.
undefined
మొహసిన్ ఖాన్ - పాకిస్థాన్ కి చెందిన ఈ నటుడు బాలీవుడ్ 'బట్వారా' అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో ధర్మేంద్ర, వినోద్ ఖన్నా వంటి తారలు నటించాడు.
undefined
సైద్ కిర్మని - 198లో వచ్చిన 'కభి అజ్నాబి ది' అనే సినిమాలో నటించాడు ఈ ఇండియన్ క్రికెటర్
undefined
వినోద్ కాంబ్లి - ముంబైకి చెందిన ఈ క్రికెటర్ 'ఆనర్త్' అనే బాలీవుడ్ చిత్రంలో నటించారు.
undefined
సచిన్ టెండూల్కర్ - క్రికెట్ గాడ్ అని పిలుచుకునే సచిన్ కూడా అయ్యాక ఆయన జీవితాధారంగా ‘సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్’ అనే బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారని తెలిసి తన పాత్రలో తానే నటిస్తానని అన్నారు. అలా సచిన్ తన సినిమాలో తానే నటించి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు.
undefined
శ్రీశాంత్ - మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు గానూ క్రికెట్ నుంచి బ్యాన్ చేయబడిన ఈ క్రికెటర్ సినిమాల్లో రాణిస్తున్నారు. తమిళంలో హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో శ్రీశాంత్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు.
undefined
ఇర్ఫాన్ పఠాన్ - ప్రముఖ మాజీ క్రికెటర్ ఇర్ఫా్న్ పఠాన్ కొత్త ఇన్నింగ్స్ ను మొదలుపెట్టబోతున్నారు. నటన పరంగా తన సత్తా చాటబోతున్నారు. విక్రమ్ హీరోగా నటిస్తోన్న ఓ తమిళ చిత్రంలో ఇర్ఫాన్.. విలన్ గా కనిపించనున్నాడు.
undefined
హర్భజన్ సింగ్ - ఇండియన్ క్రికెట్ స్పిన్నర్ హర్భజన్ యోగి దర్శకత్వం వహించే ‘డిక్కీలూనా’ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. మైదానంలో బంతిని గిర‌గిర తిప్పి బ్యాట్స్‌మెన్స్ ని తన బౌలింగ్ తో ముప్పుతిప్పలు పెట్టే బజ్జీ 'డిక్కీలూనా' సినిమాలో కీలకపాత్ర పోషిస్తుండడం విశేషం.
undefined
click me!