గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. షాకిస్తోన్న 'ఇడియట్' హీరోయిన్!

First Published | Feb 20, 2020, 6:44 PM IST

హీరోయిన్ రక్షిత పేరు చెప్పగానే ఇడియట్, శివమణి, నిజం లాంటి తెలుగు చిత్రాలు గుర్తుకు వస్తాయి. పరిమిత సంఖ్యలో చిత్రాల్లో నటించినప్పటికీ రక్షిత ఓ వెలుగు వెలిగింది. 

రక్షిత 'ఇడియట్' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ చిత్రం రవితేజని టాలీవుడ్ లో స్టార్ గా నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఇడియట్ చిత్రంలో రక్షిత, రవితేజ పోటా పోటీగా నటించారు.
ఇడియట్ తర్వాత రక్షితకు టాలీవుడ్ లో నాగార్జున, చిరంజీవి, మహేష్ బాబు లాంటి స్టార్స్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే రక్షిత 2007లో కన్నడ దర్శకుడు ప్రేమ్ ని ప్రేమ వివాహం చేసుకుంది.

పెళ్లి తర్వాత రక్షిత సినిమాలకు స్వస్తి చెప్పింది. ప్రస్తుతం భార్యగా రక్షిత ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్ గా రక్షితని సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు షాక్ కి గురవుతున్నారు.
రక్షిత ఇడియట్, శివమణి, నిజం లాంటి చిత్రాల్లో నాజూగ్గా కనిపించింది. తాజాగా ఆమె లుక్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అందుకు కారణం రక్షిత బాగా బొద్దుగా మారింది. వెండి తెరకు దూరం కావడంతో ఫిట్ నెస్ పై కూడా దృష్టిపెట్టినట్లు లేదు. అందుకే రక్షిత బాగా బొద్దుగా మారిపోయి ఆశ్చర్యపరుస్తోంది.
మునుపటిలా నాజూగ్గా కనిపించకపోయినప్పటికీ రక్షితలో కాన్ఫిడెన్స్ తగ్గలేదు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన కుటుంబ విశేషాల్ని షేర్ చేస్తోంది.
వెండి తెరకు దూరమైనప్పటికీ రక్షిత ప్రస్తుతం బుల్లితెర షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
రక్షిత తెలుగులో చివరగా నటించిన చిత్రం జగపతి. వివాహం తర్వాత సినిమాల్లో నటించకూడదని రక్షిత నిర్ణయం తీసుకుంది.
రక్షిత కొన్ని కన్నడ చిత్రాలని నిర్మించారు. బుల్లితెరపై దాదాపు 10 షోలకు హోస్ట్ గా, జడ్జిగా వ్యవహరించారు.

Latest Videos

click me!