బండ్ల గణేష్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాయి. బండ్ల గణేష్ నిర్మొహమాటంగా మాట్లాడతారు. కానీ ఆయన చేసే కామెంట్స్ ఫన్నీగా ఉండడంతో వైరల్ అవుతుంటాయి. బండ్ల గణేష్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు చేసిన కామెంట్స్ ని ఇప్పటికీ నెటిజన్లు మరచిపోలేకున్నారు. బండ్ల గణేష్ చేసిన 7 గంటలకు బ్లేడు అనే కామెంట్ ఎంతలా హల్ చల్ చేసిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు నెటిజన్లు బండ్ల గణేష్ ని ట్రంప్ తో ముడిపెడుతూ ఆడేసుకుంటున్నాడు.