నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా చిత్రం జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. కళ్యాణ్ రామ్ కి జోడిగా ఈ చిత్రంలో మెహ్రీన్ నటించింది. నేడు హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు.