త్రివిక్రమ్ మాటల వల.. ఎవరైనా చిక్కాల్సిందే!

First Published Jan 20, 2020, 12:57 PM IST

దర్శకుడు త్రివిక్రమ్ సినిమాల్లో మాటలు తూటాల్లా పేలుతుంటాయి. అందుకే ఆయనకి మాటల మాంత్రికుడనే పేరొచ్చింది. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఫ్లాప్స్ ఉన్నప్పటికీ.. ఆయన మాటలు మాత్రం ఎప్పుడూ ఫ్లాప్ కాలేదు. 

దర్శకుడు త్రివిక్రమ్ సినిమాల్లో మాటలు తూటాల్లా పేలుతుంటాయి. అందుకే ఆయనకి మాటల మాంత్రికుడనే పేరొచ్చింది. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఫ్లాప్స్ ఉన్నప్పటికీ.. ఆయన మాటలు మాత్రం ఎప్పుడూ ఫ్లాప్ కాలేదు. తాజాగా ఆయన డైరెక్టర్ చేసిన 'అల.. వైకుంఠపురములో' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో త్రివిక్రమ్ రాసిన కొన్ని డైలాగ్స్ ని అంత ఈజీగా మర్చిపోలేం.. ఆ డైలాగ్స్ పై ఓ లుక్కేద్దాం!
undefined
''నిజం చెప్పేప్పుడే భయమేస్తుంది.. చెప్పకపోతే ఎప్పుడూ భయమేస్తుంది''
undefined
మనది మిడిల్ క్లాస్.. లక్ష పనులు కోటి వర్రీస్ ఉంటాయి...తలవొంచుకొని వెళ్లిపోవాలంతే..!
undefined
దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్. ఒకటి నేలకి, రెండు వాళ్లకి. అలాంటోళ్లతో మనకి గొడవేంటి సార్. జస్ట్ సరెండర్ అయిపోవాలంతే..
undefined
గొప్పదో చెత్తదో మనమొక ఆఫర్ ఇచ్చాక అయ్యా.. మాకొద్దు అంటే దానర్ధం వద్దని.. అందులో అతి ప్రధానంగా మరీ ముఖ్యంగా ఒక స్త్రీ వద్దు అంటే మాత్రం దానర్ధం.. అస్సలు వద్దు అని..
undefined
ఇంట్లో దీపం వెలిగితే ఒక్క కుటుంబానికే వెలుగు.. అదే గుడిలో వెలిగితే ఊరంతటికీ వెలుగు
undefined
బరువు పైన ఉంటే కిందకి చూడలేం.. ఎంత బరువు పైన పెడితే అంత పైకి చూస్తావ్.. ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావ్..
undefined
వంటోడికి, వెయిటర్ కి నో చెప్పడం ఈజీ.. పవర్ ఫులోడికి నో చెప్పడం చాలా కష్టం.. ఎంత పెద్దోడికి నో చెప్తే అంత గొప్పోడివవుతావ్..
undefined
దేవుడికి కూడా దక్షిణ కావాలి.. రాజుకి కూడా రక్షణ కావాలి.
undefined
గ్రేటెస్ట్ బాటిల్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్.. గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్లతోనే
undefined
మనిషిని ప్రేమిస్తే అబద్ధం విలువ తెలుస్తుంది కరెక్టే.. కానీ నిజం చెబితేనే కదా.. ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది.
undefined
ఒక యుద్ధం వచ్చిన దేశంలో ఉన్న వాళ్లందరూ కులం, మతం, ప్రాంతం అనే తేడాలు లేకుండా కలిసిపోతారు సర్.. ఒక కష్టం వచ్చినప్పుడే కుటుంబంలో ఉన్న అందరూ.. వాళ్ల స్వార్ధం, ద్వేషం, పగ, అన్ని పక్కన పెట్టి ఒకటవుతారు.
undefined
ఎప్పుడూ పిల్లలు బాగుండాలని అమ్మానాన్నలు అనుకోవడమేనా.. అమ్మానాన్నలు బాగుండాలని పిల్లలు అనుకోరా..?
undefined
ఆడవాళ్ళు వేరే ఇంటినుంచి వచ్చినవాడిని భర్తగా ఒప్పుకుంటారు...కానీ తననుంచి రానివాడిని కొడుకుగా ఒప్పుకోరు.
undefined
click me!