సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం దర్బార్. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. నేడు హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.