క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా తాజా పోస్టర్ వైరల్ గా మారింది. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తిరిగి షూటింగ్ మొదలు పెట్టిన ఈ చిత్ర యూనిట్ క్రేజీ అప్ డేట్ తో ఫ్యాన్స్ కు పండగ చేసింది.
అదేంటంటే చరణ్, ఎన్టీఆర్ బుల్లెట్‌పై వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోని షేర్ చేసింది చిత్ర యూనిట్. ఇటీవలి కాలంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పించడానికి ఏ చిన్న అవకాశం దొరికినా వదలడం లేదు.
దీంతో ఈ ఫొటోలో బండిమీద హెల్మెట్ లేకుండా వెడుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ మొహాలకు గ్రాఫిక్స్ లో హెల్మెట్ తగిలించి.. ఆ ఫొటోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అఫీషియల్ సైట్ లో పోస్ట్ చేసింది.
ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ గ ఉంది.. అంటూదీనికి ‘వేర్ హెల్మెట్.. బి సేఫ్..’ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీన్ని రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆర్ఆర్ఆర్ టీంకు ట్యాగ్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట మరో వైరల్ గా మారింది..
అయితే ఈ ట్వీట్ కింద ఆర్ఆర్ఆర్ మూవీ టీం రీ ట్వీట్ చేస్తూ.. ఈ పిక్చర్ ఇంకా పూర్తిగా లేదు. బండికి నెంబర్ ప్లేట్ మిస్సయ్యింది అంటూ సరదాగా కామెంట్ పెట్టింది.
కాగా, ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్`. రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా, అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా ఇది రూపొందుతుంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు.
ఈ చిత్రం ఇటీవల షూటింగ్ ప్రారంభించుకున్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో వెంటనే షూటింగ్‌ని ప్రారంభించారు. రామ్‌చరణ్ సెట్‌లో అడుగుపెట్టారు. సోమవారం సెట్‌లో చరణ్ ఫోటోలు బయటకు వచ్చి హల్‌చల్ చేశాయి.
తాజాగా చిత్ర యూనిట్ క్రేజీ అప్‌డేట్‌నిచ్చింది. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే అప్‌డేట్ ఇచ్చింది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నట్టు తెలిపింది. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని, అలాగే రెండు భాషల్లో ఎన్టీఆర్,చరణ్ డబ్బింగ్ పూర్తి చేశారని వెల్లడించింది.
మిగిలిన భాషల్లో డబ్బింగ్ త్వరలోనే పూర్తి చేయబోతున్నట్టు వెల్లడించింది. జెట్ స్పీడ్‌తో షూటింగ్ పనులు జరుగుతున్నట్టు యూనిట్ వెల్లడించింది. ఈ సందర్బంగా చరణ్, ఎన్టీఆర్ బుల్లెట్‌పై వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోని పంచుకుంది. ఇది గూస్‌బమ్స్ తెప్పిస్తుంది.
మిగిలిన భాషల్లో డబ్బింగ్ త్వరలోనే పూర్తి చేయబోతున్నట్టు వెల్లడించింది. జెట్ స్పీడ్‌తో షూటింగ్ పనులు జరుగుతున్నట్టు యూనిట్ వెల్లడించింది. ఈ సందర్బంగా చరణ్, ఎన్టీఆర్ బుల్లెట్‌పై వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోని పంచుకుంది. ఇది గూస్‌బమ్స్ తెప్పిస్తుంది.