బోల్డ్ సీన్లే ఈ సినిమాల కొంప ముంచాయి..! వివాదం @ సినిమా

First Published Apr 17, 2020, 1:44 PM IST

సినిమా అనేది క్రియేటవ్‌ ఫీల్డ్. ఈ రంగంలో ఎన్ని గొప్ప సినిమాలు వచ్చాయో అదే స్థాయిలో వివాదాస్పద సినిమాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా బోల్డ్, సెక్స్యువల్‌ కంటెంట్ ఉన్న సినిమాలే వివాదాస్పదమయ్యాయి. కొన్ని సందర్భాల్లో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఒక్కోసారి ఆ వివాదాలు ముదిరి సినిమాలు బ్యాన్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యే కాదు చాలా ఏళ్లుగా ఇలా బాలీవుడ్‌లో పలు చిత్రాలు వివాదాస్పద మవుతున్నాయి.

1972లో రిలీజ్‌ అయిన సిద్ధార్థ్‌ బోల్డ్ కంటెంట్‌ కారణంగా వివాదాస్పదమైంది. లైంగిక సంబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద దుమారమే లేపింది. అప్పట్లోనే ఈ సినిమాలో హీరోయిన్‌ న్యూడ్‌ గా నటించింది.
undefined
1985లో రిలీజ్ అయిన రామ్‌ తేరి గంగ మెయిలీ సినిమా కూడా అత్యంత వివాదాస్పదమైన చిత్రాల జాబితాలో చేరింది. ఈ సినిమాలో హీరోయిన్ మందానికి తడిసి చీరాలో పూర్తిగా ఎద అందాలను ఆరబోస్తూ చేసిన బోల్డ్ సీన్స్‌ అప్పట్లో హాట్ టాపిక్‌గా మారాయి.
undefined
1994లో రిలీజ్ అయిన బండిట్‌ క్వీన్ కూడా అదే స్థాయిలో వివాదాస్పదమైంది. అత్యాచారానికి గురై ఉన్నతవర్గాల మీద పగ పెంచుకున్న ఓ మహిళ కథతో రూపొందిన ఈ సినిమా రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.
undefined
భారత్‌లో హోమోసెక్సువాలిటీ అన్న పదం పరిచయం లేని సమయంలోనే ఆ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ఫైర్‌. ఇద్దరు మహిళల మధ్య ప్రేమకథతో వచ్చిన ఈ సినిమాపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి.
undefined
భారతీయ సనాతన శృంగార గ్రంథం కామసూత్ర కథతోనూ భారతీయ దర్శక నిర్మాతలు సినిమాను రూపొందించారు. బోల్డ్, న్యూడ్ కంటెంట్‌తో రూపొందిన ఈ సినిమా కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది.
undefined
ఈ జనరేషన్‌కు కూడా సూపరిచితమైన మోస్ట్ కాంట్రవర్షియల్‌ బోల్డ్‌ మూవీ మర్డర్‌. అక్రమ సంబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలోని హాట్‌ సీన్స్‌ తీవ్ర చర్చకు దారితీశాయి. అదే సమయంలో ఆ తరహా సినిమాలు మరిన్ని రూపొందేందుకు కారణమైంది మర్డర్‌.
undefined
మతపరమైన ఓ వ్యక్తి ఓ అమ్మాయితో అక్రమ సంబంధం కలిగి ఉండటం అనే కథతో తెరకెక్కిన సినిమా సిన్‌. మతం, సెక్స్ లాంటి వివాదాస్పద అంశాల కారణంగా ఈ సినిమా మీద చర్చ మొదలైంది.
undefined
బిగ్‌ బి అమితాబ్ బచ్చన్ నటించిన నిశ్శబ్ద్‌ సినిమా కూడా వివాదాస్పదమైంది. ఓ 70 ఏళ్ల వ్యక్తి చిన్న వయసు అమ్మాయితో ప్రేమలో పడటం అనే కథతో తెరకెక్కిన ఈ సినిమాపై కూడా విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి.
undefined
ఇటీవల కాలంలో పద్మావత్ సినిమా కూడా కలకలం సృష్టించింది. సినిమా కథా కథనాలు రాజ్‌పుత్‌ మహిళలను అవమానించేవిగా ఉన్నాయంటూ కొందరు ఆరోపించటంతో ఈ సినిమా పై వివాదం మొదలైంది. చిత్ర యూనిట్ మీద దాడులు కూడా జరిగాయి. చివరకు ఆందోళనకారులకు సినిమా చూపించిన తరువాత విడుదలకు అంగీకరించారు.
undefined
click me!