Published : Apr 09, 2020, 05:11 PM ISTUpdated : Apr 09, 2020, 05:12 PM IST
సంజయ్ దత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భూమి సినిమాతో వెండితెరకు పరిచయమైన హాట్ బ్యూటీ సాక్షి ద్వివేది. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో అందాలు ఆరబోస్తుంది. హాట్ హాట్ ఫోటో షూట్‌లతో అభిమానులను అలరించే ఈ బ్యూటీ టిక్ టాక్‌లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే ఈ అందాల భామకు టిక్ టాక్ ఏకంగా 10 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అమ్మడికి అదే రేంజ్‌లో ఉంది ఫాలోయింగ్. సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం సాక్షి ఫాలోయింగ్ చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే.